Home > తెలంగాణ > Telangana Elections 2023 > TS Assembly Elections 2023 : రామప్ప ఆలయంలో రాహుల్, ప్రియాంక ప్రత్యేక పూజలు
TS Assembly Elections 2023 : రామప్ప ఆలయంలో రాహుల్, ప్రియాంక ప్రత్యేక పూజలు
Kiran | 18 Oct 2023 6:06 PM IST
X
X
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రామప్ప ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీ కార్డులను స్వామి చెంత ఉంచి పూజలు చేశారు.కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క తదితరులు రాహుల్, ప్రియాంక వెంట ఉన్నారు. ప్రత్యేక పూజల అనంతరం వారిద్దరూ రామప్ప ఆలయం నుంచి కాంగ్రెస్ విజయభేరి బస్సు యాత్రను గాంధీ ప్రారంభించారు.
బస్సు యాత్ర సాయంత్రానికి ములుగుకు చేరుకోనుంది. అక్కడ నిర్వహించే బహిరంగ సభలో రాహుల్ గాంధీ, ప్రియాంకలు పాల్గొని ప్రసంగిస్తారు. 3రోజులపాటు 8 నియోజకవర్గాల్లో ఈ బస్సు యాత్ర కొనసాగనుంది.
Updated : 18 Oct 2023 6:06 PM IST
Tags: telanganamts election assembly election ts politics congress rahul gandhi priyanka gandhi bus yatra ramappa temple six guarenttee card special puja seethakka congress public meeting
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire