Home > తెలంగాణ > Telangana Elections 2023 > Rahul Gandhi : రంగంలోకి రాహుల్ గాంధీ.. సీఎం అభ్యర్థిపై వీడనున్న ఉత్కంఠ

Rahul Gandhi : రంగంలోకి రాహుల్ గాంధీ.. సీఎం అభ్యర్థిపై వీడనున్న ఉత్కంఠ

Rahul Gandhi  : రంగంలోకి రాహుల్ గాంధీ.. సీఎం అభ్యర్థిపై వీడనున్న ఉత్కంఠ
X

కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరనేదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎం ఎంపిక బాధ్యతను అధిష్టానానికి అప్పగిస్తూ సీఎల్పీ తీర్మానించడంతో బంతి అధిష్టానం కోర్టులో ఉంది. ఈ క్రమంలో అగ్రనేత రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. ఖర్గే నివాసంలో సీఎం అభ్యర్థి ఎంపికపై చర్చిస్తున్నారు. కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సైతం ఖర్గే నివాసానికి చేరుకుని ఎమ్మెల్యేల అభిప్రాయానికి సంబంధించిన నివేదికను అందజేశారు. ఈ నివేదికపై ఖర్గే, కేసీ వేణుగోపాల్తో రాహుల్ చర్చిస్తున్నారు. దీంతో సాయంత్రంలోపు సీఎం అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. కాగా ఇవాళే సీఎం అభ్యర్థిని ఎంపిక చేస్తామని ఖర్గే స్పష్టం చేశారు.

మరోవైపు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఢిల్లీలోనే ఉన్నారు. డీకే శివకుమార్తో భేటీ అయిన ఉత్తమ్.. సీఎం అభ్యర్థిపై చర్చించారు. తమకు సీఎం అవకాశం ఇవ్వాలని భట్టి, ఉత్తమ్ డిమాండ్ చేస్తున్నారు. అయితే తెలంగాణ నెక్ట్స్ సీఎంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేరు దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. సీఎల్పీ భేటీలోనూ రేవంత్ రెడ్డి వైపే మెజార్టీ ఎమ్మెల్యేలు మొగ్గు చూపినట్లు టాక్. ఈ క్రమంలో అధిష్టానం నిర్ణయంపై మరికొన్ని గంటల్లో ఉత్కంఠ వీడనుంది.


Updated : 5 Dec 2023 8:03 AM GMT
Tags:    
Next Story
Share it
Top