Home > తెలంగాణ > Telangana Elections 2023 > Rahul gandhi : కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ అవినీతి సొమ్మంతా కక్కిస్తాం : రాహుల్

Rahul gandhi : కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ అవినీతి సొమ్మంతా కక్కిస్తాం : రాహుల్

Rahul gandhi  : కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ అవినీతి సొమ్మంతా కక్కిస్తాం : రాహుల్
X

తెలంగాణలో కాంగ్రెస్ను ఓడించేందుకు బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కలిసి పనిచేస్తున్నాయని రాహుల్ గాంధీ అన్నారు. బీఆర్ఎస్ వెంట డబ్బులు, అధికారం ఉంటే.. కాంగ్రెస్కు ప్రజాబలం, ఉందన్నారు. ఈ ఎన్నికల్లో దొరల తెలంగాణ ప్రజల తెలంగాణ మధ్య యుద్ధం నడుస్తుందని వ్యాఖ్యానించారు. ధరణి పేరుతో భూములను లాక్కున్నారని.. ధరణితో లాభం జరిగింది కల్వకుంట్ల కుటుంబానికే మాత్రమే అని ఆరోపించారు. కల్వకుంట్ల ఫ్యామిలీ చేతుల్లోనే రెవెన్యూ, ఎక్సైజ్ శాఖలు ఉన్నాయని గుర్తుచేశారు.

తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నో ప్రాజెక్టులు నిర్మించిందని రాహుల్ గాంధీ చెప్పారు. నాగార్జున సాగర్, శ్రీరాంసాగర్, సింగూరు ప్రాజెక్టులను నిర్మించామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు భరోసా కింద రైతులకు 15, కౌలు రైతులకు 12వేలు ఇస్తామన్నారు. రాజీవ్ ఆరోగ్య శ్రీతో 10లక్షల ఆరోగ్య బీమా, విద్యాభరోసా పేరుతో విద్యార్థులకు 5లక్షల సాయం, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత

ప్రయాణం, ఇల్లులేని వారికి ఇందిరమ్మ ఇల్లు, 500కే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు.

కల్వకుంట్ల కుటుంబం అవినీతిపై ఈడీ, సీబీఐ, విచారణలుండవన్న రాహుల్.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అవినీతి సొమ్మంతా కక్కిస్తామని చెప్పారు. బీజేపీ, ఎంఐఎంకే ఓటేస్తే బీఆర్ఎస్కు ఓటేసినట్లేనని.. లోక్ సభలో బీజేపీ తెచ్చిన అన్ని బిల్లులకు బీఆర్ఎస్ మద్ధతు తెలిపిందని ఆరోపించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు సోనియా గాంధీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని.. కానీ రాష్ట్రం వచ్చాక ప్రజల ఆకాంక్షలు కల్లలు అయ్యాయని చెప్పారు. తెలంగాణ ప్రజల కలలను కాంగ్రెస్ నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ కుట్రలకు కాంగ్రెస్ కార్యకర్తలు భయపడరని.. ప్రజా తెలంగాణ కోసం అందరు కలిసికట్టుగా కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు.

తెలంగాణతో తనకున్నది రాజకీయ బంధం మాత్రమే కాదని.. కుటుంబ బంధమని రాహుల్ అన్నారు. తన సోదరి ప్రియాంక అనారోగ్య కారణాలతో ఈ సభకు రాలేకపోయిందని.. కానీ మా కుటుంబసభ్యులకు ఒక సోదరుడికి తాను వచ్చినట్లు రాహుల్ చెప్పారు. అప్పట్లో తన నానమ్మ ఇందిరి గాంధీకి తెలంగాణ ప్రజలు అండగా నిలిచారని గుర్తుచేసుకున్నారు. తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ పోరాడుతుందని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను మొదటి కేబినెట్ లోనే అమలు చేస్తామని హామీ ఇచ్చారు.


Updated : 31 Oct 2023 7:16 PM IST
Tags:    
Next Story
Share it
Top