Home > తెలంగాణ > Telangana Elections 2023 > Rahul Gandhi : తెలంగాణ కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ జూమ్ మీటింగ్

Rahul Gandhi : తెలంగాణ కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ జూమ్ మీటింగ్

Rahul Gandhi : తెలంగాణ కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ జూమ్ మీటింగ్
X

ఎన్నికల కౌంటింగ్ వేళ తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ వైపే మొగ్గుచూపడంతో ఆ పార్టీ అప్రమత్తమైంది. అభ్యర్థులు చేజారకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్ర నేతలతో జూమ్ మీటింగ్ నిర్వహించనున్నారు. కౌంటింగ్ వేళ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. అదేవిధంగా పలు అంశాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. దీంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

మరోవైపు తెలంగాణ ఎన్నికల ఫలితాల మానిటరింగ్ బాధ్యతల్ని కాంగ్రెస్ అధిష్టానం కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్కు అప్పగించింది. గెలిచినా, హంగ్ లేదా తక్కువ మెజార్టీ వచ్చినా ఎమ్మెల్యేలు చేజారిపోకుండా క్యాంపుకు సన్నాహాలు చేస్తున్నారు. హంగ్ వస్తే క్యాంప్ రాజకీయాలన్నీ డీకే కనుసన్నల్లోనే జరగనున్నట్లు సమాచారం. మేజిక్ ఫిగర్ దాటినా ఎమ్మెల్యేలందరినీ బెంగళూరుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు జరగనున్న 49 కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ప్రత్యేక పరిశీలకులను ఏఐసీసీ నియమించింది.


Updated : 2 Dec 2023 4:13 PM IST
Tags:    
Next Story
Share it
Top