TS Assembly Elections 2023 : సస్పెన్షన్, టికెట్ కేటాయింపుపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
X
అసెంబ్లీ ఎన్నికల రేసులో బీఆర్ఎస్ దూసుకుపోతుండగా.. కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది. అయితే బీజేపీ మాత్రం ఇంకా అభ్యర్థుల్ని ఖరారు చేయలేదు. ఈ క్రమంలో ఆ పార్టీ సస్పెండెడ్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు మూడు రోజుల్లో బీజేపీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేస్తుందని అన్నారు. దాదాపు 40 - 50 మందితో ప్రకటించనున్న తొలి జాబితాలో ఆ లిస్టులో తన పేరు కచ్చితంగా ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ హైకమాండ్ తనకు ఫుల్ సపోర్ట్ చేస్తోందని చెప్పారు.
బీజేపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ ప్రకటించేలోపు తనపై ఉన్న సస్పెన్షన్ వేటు ఎత్తివేస్తారని రాజాసింగ్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. పార్టీ తనను సస్పెండ్ చేసినా అండగా నిలిచిన గోషా మహల్ నియోజకవర్గ కార్యకర్తలకు, ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. ఈసారి రెట్టింపు మెజారిటీతో గోషామహల్ నుంచి గెలస్తానని ధీమా వ్యక్తం చేశారు. గోషామహల్ లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థిలేక బయటి నుంచి తెచ్చుకున్నారని రాజాసింగ్ విమర్శించారు. బీఆర్‌ఎస్ పార్టీకి అభ్యర్థి ఇంకా దొరకడం లేదని సటైర్ వేశారు. ఎన్నికల అనంతరం తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.