Home > తెలంగాణ > Telangana Elections 2023 > Telangana assembly election: బీజేపీ RRR లో ఒక్క R గెలిచింది

Telangana assembly election: బీజేపీ RRR లో ఒక్క R గెలిచింది

Telangana assembly election: బీజేపీ RRR లో ఒక్క R గెలిచింది
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో (Telangana Assembly Elections) బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. కాషాయదళంలోని హేమాహేమీలంతా ఓటమి దిశగా పయనిస్తున్నారు. పార్టీ ముఖ్య నేతలంతా వెనుకంజలో ఉన్నారు. కరీంనగర్‌లో బండి సంజయ్‌, కోరుట్లలో ధర్మపురి అర్వింద్ వెనకంజలో ఉన్నారు. RRR గా చెప్పుకుంటున్న బీజేపీ ప్రముఖ నేతలు ఈటల రాజేందర్‌. గజ్వేల్‌తో పాటు హుజూరాబాద్‌లోనూ ఓటమిని చవిచూడగా.. దుబ్బాకలో రఘునందన్ రావు కూడా పరాజయం పాలయ్యారు. మరో ఆర్ అయినటువంటి రాజాసింగ్ గోషామహల్‌లో స్వల్ప ఆధిక్యంలో గెలిచారు.

కరీంనగర్‌ ఈసారి కచ్చితంగా నెగ్గుతారనే అంచనాలున్న బండి సంజయ్‌.. గంగుల కమలాకర్‌ చేతిలో ఓటమి దిశగా వెళ్తున్నారు. బీజేపీలో హేమాహేమీలు వెనుకంజలో ఉన్నప్పటికీ.. 8 చోట్ల మాత్రం ఆధిక్యంలో ఉంది. నిజామాబాద్‌ అర్బన్‌లో బీజేపీ అభ్యర్థి ధన్‌పాల్‌ సూర్యనారాయణ, కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి వెంకట రమణారావు గెలుపొందారు. కార్వాన్, సిర్పూర్ కాగజ్‌నగర్, నిర్మల్, ముథోల్, బోథ్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్ లో బీజేపీ ముందంజలో ఉంది. ముఖ్యనేతలంతా వెనుకంజలో ఉన్నా.. ఈ తొమ్మిది స్థానాల్లో ఆధిక్యంలో ఉండడం.. ఆసక్తి రేపుతోంది.




Updated : 3 Dec 2023 3:07 PM IST
Tags:    
Next Story
Share it
Top