Telangana assembly elections 2023: కేసీఆర్కు రేవంత్ రెడ్డి సవాల్
X
కామారెడ్డి ఎన్నికల తీర్పు భారతదేశ చరిత్రలో గొప్ప తీర్పుగా నిలవాలన్నారు. ఆ తీర్పుకోసం 150 కోట్లమంది ప్రజలు కామారెడ్డివైపు చూస్తున్నారని అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. పదేళ్లు కష్టపడ్డామని, కేసీఆర్ కు తిరిగి చెల్లించే సమయం వచ్చిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో ఉచిత కరెంట్, మైనార్టీల రిజర్వేషన్ తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ అని చెప్పుకొచ్చారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో రూ. 12వేల కోట్ల కరెంట్ బకాయిలు రద్దుచేశామని అన్నారు. క్వశ్చన్ పేపర్ల లీకేజీ, ఉచిత కరెంట్, మిషన్ కాకతీయ, మేడిగడ్డ, పాలమూరు ప్రాజెక్టుల ఫెయిల్యూర్ లపై కేసీఆర్ ఎందుకు మాట్లాడట్లేదని ప్రశ్నించారు. డబ్బు, మద్యంతో ప్రజలను మభ్యపెట్టి ఎన్నికల్లో గెలవాలని కేసీఆర్ చూస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
ప్రపంచ మొత్తం కామారెడ్డివైపు చూస్తుంది. రాష్ట్రంలో ఎక్కడైనా గెలుస్తా కానీ కేసీఆర్ కు బుద్ధి చెప్పడానికి కామారెడ్డిలో పోటీ చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కామారెడ్డి తెలంగాణ భవిష్యత్తును మారుస్తుంది. కర్నాటకలో గెలిచినట్లు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కూడా గెలుస్తుందని రేవంత్ దీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో 24 గంటల ఉచిత కరెంట్ ఎక్కడిస్తున్నారో చెప్పాలని అన్నారు. కేసీఆర్ 24 గంటల కరెంట్ పై కామారెడ్డి చౌరాస్తాలో చర్చకు రావాలని సవాల్ విసిరారు. నిరూపిస్తే కామారెడ్డితో పాటు, కోదాడలో కూడా తన నామినేషన్ ను విత్ డ్రా చేసుకుంటానని చెప్పారు. దమ్ముంటే కేసీఆర్ లాగ్ బుక్ తీసుకోవాలని కామారెడ్డికా రావాలని అన్నారు. కామారెడ్డిలో దొరల రాజ్యానికి ప్రజా రాజ్యానికి మధ్య పోటీ జరుగుతుందని చెప్పారు. కామారెడ్డి పచ్చని భూములపై కేసీఆర్ కన్ను పడిందని అందుకే ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి ఆరోపించారు.