Revanth Reddy : సోనియా, రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి భేటీ..
X
రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. ఏఐసీసీ పెద్దలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిన్న సాయంత్రం ఢిల్లీ వెళ్లిన రేవంత్.. కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఎంపీ మాణిక్కం ఠాగూర్తో ఆయన సమావేశమై ప్రమాణస్వీకారానికి రావాలని ఆహ్వానించారు. ఇవాళ మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్లను కలిశారు. తన ప్రమాణస్వీకారానికి రావాలని ఆహ్వానించారు. రేపు సీఎంగా రేవంత్ ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే, కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్ సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.
మరోవైపు రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన విషెస్ చెబుతున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బాలకృష్ణ, కర్నాటక సీఎం సిద్ధరామయ్య, బండ్ల గణేష్ సహా పలువురు ప్రముఖులు ఆయనకు విషెస్ చెప్పారు. రేవంత్ నాయకత్వంలో తెలంగాణ మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.