Home > తెలంగాణ > Telangana Elections 2023 > Revanth Reddy : వెయ్యి మంది కేసీఆర్లు వచ్చినా.. తెలంగాణ రాష్ట్రం రాకపోయేది: రేవంత్ రెడ్డి

Revanth Reddy : వెయ్యి మంది కేసీఆర్లు వచ్చినా.. తెలంగాణ రాష్ట్రం రాకపోయేది: రేవంత్ రెడ్డి

Revanth Reddy : వెయ్యి మంది కేసీఆర్లు వచ్చినా.. తెలంగాణ రాష్ట్రం రాకపోయేది: రేవంత్ రెడ్డి
X

వెయ్యి మంది కేసీఆర్లు వచ్చినా తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోయేదని అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సోనియా గాంధీ చొరవ వల్లే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు. తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ, సామాజిక అభివృద్ధి కోరుకున్నారు. కానీ కేసీఆర్ అభివృద్ధిపై ఉక్కుపాదం మోపారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నిధులు పేదల సంక్షేమానికి ఉపయోగపడలేదని ఆరోపించారు. బంగారు తెలంగాణ ఫలాలు ఎవరికి అందుతున్నాయని ప్రశ్నించారు. కేసీఆర్ నియంత ముసుగులో ఉన్న పొలిటిషియన్ అని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం స్పూర్తి లోపించిందని తీవ్ర స్థాయిలో ఆరోపించారు. కేసీఆర్ పాపాల పుట్ట కదులుతోందని చెప్పారు.

పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు చెప్పాలని రేవంత్ అన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఎవరు బాగుపడ్డారని ప్రశ్నించారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం కొరవడింది. తెలంగాణ అభివృద్ధి కోసం కాంగ్రెస్ దగ్గర నిర్దిష్టమైన ప్రణాళిక ఉందని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. మూసి నదిని ప్రక్షాళన చేసి సుందరంగా తీర్చిదిద్దుతాం. రాచకొండను ఊటీగా మార్చుతామని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలను సచివాలయానికి రానివ్వడం లేదని మండిపడ్డారు. ఉద్యమంలోనూ ఇంలాంటి నిర్బంధం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యతా లోపం వల్లే మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగిపోయిందని, రాష్ట్రంలో చెప్పిన ప్రతీ ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిందని ఆరోపించారు. మేడిగడ్డ పిల్లర్ మూడు అడుగులు కుంగిపోయిందని, అడుగున ఇసుక ఉందని నీటిపారుదలశాఖ ఇంజినీర్లకు తెలియదా? అని రేవంత్ రెడ్డి నిలదీశారు.




Updated : 3 Nov 2023 12:36 PM IST
Tags:    
Next Story
Share it
Top