కోర్టులో రౌడీషీటర్ వీరంగం
X
క్రైమ్ చేసేటప్పుడు గుర్తుకురాని పెళ్లి..జైలుకెళ్లినప్పుడు మాత్రం ఓ రౌడీషీటర్‌కు గుర్తుకొచ్చింది. ఓ కేసులో కోర్టు శిక్ష వేస్తే ఈనెల 25న పెళ్లి ఉంది జైలుకెళ్లను అంటూ మొండికేశాడు. నాంపల్లి కోర్టులోనే నానా హంగామా సృష్టించాడు. అక్కడున్న అద్దాలను చేతితో కొట్టి ధ్వంసం చేశాడు. దీంతో అతడికి చేతికి గాయాలయ్యాయి.
18 కేసులున్న రౌడీషీటర్ ఆనంద్ అగర్వాల్ తాజాగా గంజాయి కేసులో పట్టుబడ్డాడు. అతడిని శాలిబండ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం అతడికి రిమాండ్ విధించింది. దీంతో కోపంతో ఊగిపోయినా అగర్వాల్ నానా రచ్చ చేశాడు. తనకు త్వరలో పెళ్లి ఉండడంతో జైలుకెళ్లనని గొడవకు దిగాడు. అతి కష్టంతో అతడిని పోలీసులు అదుపు చేశారు. ఆనంద్ అగర్వాల్ గతంలో గంజాయి కేసులతో పాటు, ఓ మర్డర్ కేసు, దొంగతం కేసులు ఉన్నాయి. ఇటీవలే జైలు రిలీజ్ అయ్యి..మళ్లీ కటకటాల పాలయ్యాడు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.