Home > తెలంగాణ > Telangana Elections 2023 > Revanth Reddy : 6 గ్యారంటీల అమలుకు ఎన్ని రూ.కోట్లు ఖర్చవుతాయంటే...

Revanth Reddy : 6 గ్యారంటీల అమలుకు ఎన్ని రూ.కోట్లు ఖర్చవుతాయంటే...

Revanth Reddy  : 6 గ్యారంటీల అమలుకు ఎన్ని రూ.కోట్లు ఖర్చవుతాయంటే...
X

తెలంగాణలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ ప్రయోగించిన బ్రహ్మాస్తం.. 6 గ్యాంరటీలు. ఎన్నికల మేనిఫెస్టోలో ఆ పార్టీ ప్రకటించిన ఈ హామీలను నమ్మి చాలా మంది హస్తం గుర్తుకే తమ ఓటు వేశారు. గురువారం మధ్యాహ్నం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న ఎనుముల రేవంత్ రెడ్డి ఈ ఆరు గ్యారంటీల ముసాయిదాపై తొలుత సంతకం చేస్తారు. అనంతరం మంత్రివర్గం భేటీ అయి.. దానికి ఆమోదం తెలుపుతుంది. అయితే ఇప్పుడు ఆ హామీల అమలే కాంగ్రెస్ కు సవాల్‌గా మారనుంది. ఈ ఆరు గ్యారంటీల అమలుకు ఏటా సుమారు రూ. 70 వేల కోట్లు అవసరమని అంచనా. అంత ఖజానా రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉందా? అప్పులు తెచ్చుకునే పరిస్థితి అయినా ఉందా? అని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్ ఎన్నికల్లో ప్రకటించిన ఆరు గ్యారంటీలు..

1. మహాలక్ష్మీ పథకం : మహిళలకు ప్రతి నెలా రూ. 2,500. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. రూ. 500 కే గ్యాస్ సిలిండర్. రాష్ట్రంలో 1.20 కోట్ల మంది గ్యాస్‌ వినియోగదారులుండగా.. అర్హతలు నిర్ణయించిన తర్వాత వారిలో రాయితీ ఎంతమందికి వర్తిస్తుందనే విషయం తెలుస్తుంది.

2. రైతు భరోసా : రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి రూ. 15,000. వ్యవసాయ కూలీలకు రూ. 12,000. వరి పంటకు రూ. 500 బోనస్

3. గృహ జ్యోతి : ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్

4. ఇంధిరమ్మ ఇండ్లు : ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, రూ. 5 లక్షలు. ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం

5. యువ వికాసం : విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డు. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్

6. చేయూత : ఈ పథకం కింద వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, కల్లుగీత, చేనేత కార్మికులు, హెచ్‌ఐవీ, బోదకాలు బాధితులు, డయాలసిస్‌ చేయించుకుంటున్న వారికి నెలవారీ పింఛను రూ.4,000. పేదవారికి రాజీవ్ ఆరోగ్య శ్రీ బీమా రూ. 10 లక్షలు.





ఇచ్చిన పథకాలను అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరానికి 1.2 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ్ పేర్కొన్నారు. దీనికి అదనంగా రూ. 2 లక్షల రుణమాఫీ పథకానికి రూ. 20,000 కోట్లు అవసరం అన్నారు. ఇది 2022-23లో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం, ఆదాయ వ్యయాలు రూ. 1.72 లక్షల కోట్లకు దాదాపు సమానం అని తెలిపారు. మరోవైపు ఇచ్చిన హమీలన్నీ అమలు చేయడానికి ప్రభుత్వం మరిన్ని అప్పులు చేయాల్సి వస్తుందని ఆర్థిక శాఖ సీనియర్ అధికారులు చెబుతున్నారు. కానీ రాష్ట్రం ఇప్పటికే అప్పుల్లో ఉందని, పరిమితి దాటిపోయింది కాబట్టి కొత్త అప్పులు కూడా కష్టం అని చెబుతున్నారు. మరి ఈ సవాళ్లను అధిగమించి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను ఎలా అమలు చేస్తుందో చూడాలి.








Updated : 7 Dec 2023 8:26 AM IST
Tags:    
Next Story
Share it
Top