RS Praveen Kumar : సిర్పూరులో రిగ్గింగ్.. బీఆర్ఎస్, బీఎస్పీ మధ్య ఉద్రిక్తత
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంతంగా ముగిసినా.. కొన్నిచోట్ల ఉద్రిక్తత నెలకొంది. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాంల్లో రిగ్గింగ్ జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షడు, సిర్పూర్ నియోజకవర్గ బీఎస్పీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ సిర్పూర్ అభ్యర్థి, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అండతో ఆయన వర్గీయులు పలు పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్ కు పాల్పడినట్లు బీఎస్పీ నేతలు ఆరోపిస్తున్నారు. గురువారం రాత్రి కాగజ్ నగర్ పట్టణంలోని 90వ పోలింగ్ కేంద్ర వద్ద బీఎస్పీ శ్రేణులతో కలిసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన ఆయన.. పోలింగ్ బూత్ నంబర్లు 55,56,75,90 ల్లోని ఈవీఎంలలో బీఆర్ఎస్ నాయకులు.. అధికారుల అండతో రిగ్గింగ్ జరిపినట్లు చెప్పారు. ఆయా పోలింగ్ సెంటర్లలోని సీసీ కెమెరాలను పరిశీలించి సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.