KCR : విరామం లేని ప్రయాణం.. నేడు ఆ నియోజకవర్గాల్లో కేసీఆర్ సభలు
X
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే 60 నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలు ఏర్పాటు చేసి విజయవంతంగా పూర్తిచేసిన ఆయన.. విరామం లేని ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఇవాళ మొత్తం 4 నియోజకవర్గాల్లో సీఎం పాల్గొంటారు. ఆయన షెడ్యూల్ లో రెండో విడత సభల్లో భాగంగా మరోసారి కరీంనగర్ కు రానున్నారు. ఈనెల 17న ఇప్పటికే కరీంనగర్, చొప్పదండి, హుజురాబాద్ నియోజకవర్గాల్లో పాల్గొన్న కేసీఆర్ ఇవాళ ఎల్ఎండీ కాలనీలో మానకొండూర్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు. శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కాలేజీ ఆవరణలో సభ నిర్వహించనున్నారు. కరీంనగర్ తో పాటు.. స్టేషన్ ఘన్పూర్, నకిరేకల్, నల్గొండ బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొననున్నారు.
సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు మూనకొండూర్ చేరుకుని శ్రీ చైతన్య కాలేజీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన భారీ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం ప్రసంగిస్తారు. పార్టీ నేతలు ఈ సభకు భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు ఉమ్మడి వరంగల్ జిల్లా చేరుకుని స్టేషన్ ఘన్పూర్ సభలో పాల్గొంటారు. తర్వాత నకిరేకల్, నల్గొండ సభల్లో పాల్గొంటారు. సీఎం కేసీఆర్ వస్తున్నందున రెండు బహిరంగ సభలకు ఆయా జిల్లాల పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఖమ్మంలోని పాలెట్ స్టేడియం, కొత్తగూడెంలోని ప్రగతి మైదాన్‌లో హెలిప్యాడ్‌లను అధికారులు సిద్ధం చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. కాగా, ఆశీర్వాద సభలకు రెండు నియోజకవర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. మరోవైపు కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి నేడు హైదరాబాద్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. బన్సీలాల్పేట్, ప్యారడైజ్, పాటిగడ్డ మీదుగా అమీర్పేట్ వరకు రోడ్ షో నిర్వహిస్తారు.