KCR : కేసీఆర్కు భద్రత తగ్గింపు.. జడ్ నుంచి వై ప్లస్కు
X
మాజీ సీఎం కేసీఆర్కు భద్రతను తగ్గించారు. ఆయన భద్రతను జడ్ కేటగిరి నుంచి వై ప్లస్‌కు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి 1+4 చొప్పున రెండు షిఫ్టుల్లో కలిపి 2+8 మంది భద్రత సిబ్బంది ఉండనున్నారు. కేసీఆర్ నివాసం వద్ద నిరంతరం గార్డుల కాపలాతో పాటు పరిసరాల్లోనూ మఫ్టీలో సిబ్బంది ఉంటారు. బయటికి వెళ్లినప్పుడు ఎస్కార్ట్ భద్రత యథావిధిగా కొనసాగనుంది. ఉన్నత పదవుల్లో ఉన్నవారు మాజీలుగా మారిన తర్వాత భద్రతను కుదించే ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నార.
సాధారణంగా సీఎంగా ఎన్నికైన వారికి జడ్ కేటగిరి భద్రత కల్పిస్తారు. అదే సమయంలో తాజా మాజీ ముఖ్యమంత్రికి వై ప్లస్‌కు తగ్గించడంతోపాటు వారికంటే ముందు సీఎంగా చేసిన వారి భద్రత వై కేటగిరీకి తగ్గిస్తారు. ఇందులో భాగంగా కేసీఆర్ కంటే ముందు సీఎంగా ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డికి ఇప్పటివరకు ఉన్న వై ప్లస్ భద్రతను వై కేటగిరీకి కుదించారు. మావోయిస్టులతో ముప్పు వంటి ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే భద్రతను యథావిధిగా కొనసాగిస్తారు. కాగా ఇప్పటికే మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు భద్రతను తగ్గించిన సంగతి తెలిసిందే.