Damodar Raja Narasimha : ఆందోల్ సెంటిమెంట్ రిపీట్.. అక్కడ గెలిచిన పార్టీదే అధికారం
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మొగించింది. 65 స్థానాల్లో గెలిచి అధికారాన్ని చేపట్టింది. రేపు ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క పదవి చేపట్టనున్నారు. కాంగ్రెస్ గెలుపులో ఆందోల్ సెంటిమెంట్ పనిచేసిందని అంటున్నారు. గతాన్ని చూస్తుంటే అదే నిజమనిపిస్తుంది. ఆందోల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దామోదర రాజనర్సింహ గెలుపొందారు. సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ను ఓడించారు. అయితే ఆ నియోజకవర్గంలో గెలిచిన పార్టీ రాష్ట్రంలో అధికారం చేపడుతుందనేది రివాజుగా వస్తోంది. 1984 నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనరసింహ గెలుపుతో ఆ సెంటిమెంట్ మరోసారి రిపీట్ అయింది. 2014లో టీఆర్ఎస్ పార్టీ నుంచి బాబూ మోహన్ గెలుపొందారు. 2009లో అధికారం చేపట్టినప్పుడు ఇక్కడ కాంగ్రెస్ తరుపున గెలిచింది కూడా దామోదర రాజనర్సింహనే. తాజాగా మరోసారి ఆ సెంటిమెంట్ రిపీట్ అయింది.