Home > తెలంగాణ > Telangana Elections 2023 > Telangana Assembly 2023 : ప్రమాణస్వీకారం చేయని ఎమ్మెల్యేలు వీరే

Telangana Assembly 2023 : ప్రమాణస్వీకారం చేయని ఎమ్మెల్యేలు వీరే

Telangana Assembly 2023 : ప్రమాణస్వీకారం చేయని ఎమ్మెల్యేలు వీరే
X

తెలంగాణ మూడో అసెంబ్లీ కొలువుదీరింది. తొలిరోజు 119 మంది ఎమ్మెల్యేల్లో 99 మంది ప్ర‌మాణం చేశారు. వారిలో 60 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాగా.. 32 మంది బీఆర్ఎస్, ఎంఐఎం నుంచి ఆరుగురు, సీపీఐ నుంచి ఒక‌రు ఎమ్మెల్యేగా ప్ర‌మాణం చేశారు. వారిలో 15 మంది ఇంగ్లీషులో ప్ర‌మాణ‌స్వీకారం చేశారు.

అసెంబ్లీ తొలి రోజు ప్రొటెం స్పీక‌ర్ అక్బ‌రుద్దీన్ ఒవైసీ స‌భ్యుల‌చే ఎమ్మెల్యేలుగా ప్ర‌మాణ స్వీకారం చేయించారు. అయితే వివిధ కారణాలతో కొందరు శాసనసభకు హాజరుకాలేదు. వారిలో కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, కేసీఆర్, మ‌హేశ్వ‌ర్ రెడ్డి, బ‌త్తుల‌ ల‌క్ష్మారెడ్డి, ధ‌న్‌పాల్ సూర్య‌నారాయ‌ణ‌, క‌డియం శ్రీహ‌రి, కేటీఆర్, వెంక‌ట ర‌మాణారెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి, ప‌ద్మారావు, పైడి రాకేశ్ రెడ్డి, ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి, పాల్వాయి హ‌రీశ్ బాబు, పాయ‌ల్ శంక‌ర్, రామారావు ప‌వార్, రాజాసింగ్ ఉన్నారు.

ఇంగ్లీషులో ప్ర‌మాణం చేసిన వారిలో లాస్య నందిత, ప‌ద్మావ‌తి రెడ్డి, అహ్మ‌ద్ బిన్ అబ్దుల్లా బ‌లాల‌, బండారి ల‌క్ష్మారెడ్డి, గ‌డ్డం వినోద్, మ‌ధుసూద‌న్ రెడ్డి, కేపీ వివేకానంద, కాలేరు వెంక‌టేశ్‌, ప్రేమ్ సాగ‌ర్ రావు, ల‌క్ష్మీకాంతారావు, మ‌ద‌న్ మోహ‌న్ రావు, ముఠా గోపాల్, మైనంప‌ల్లి రోహిత్, తెల్లం వెంక‌ట్రావ్, గ‌డ్డం వివేక్ ఉన్నారు. ఇక ఎంఐఎం ఎమ్మెల్యేలు అహ్మ‌ద్ బిన్ అబ్దుల్లా బ‌లాల‌, జాఫ‌ర్ హుస్సేన్, కౌస‌ర్ మొయినుద్దీన్, జుల్ఫీక‌ర్ అలీ, మ‌హ్మ‌ద్ మాజీద్ హుస్సేన్, మ‌హ్మ‌ద్ మోబిన్ ఉర్దూలో ప్ర‌మాణం చేశారు.




Updated : 9 Dec 2023 8:44 AM GMT
Tags:    
Next Story
Share it
Top