TS Assembly Elections 2023 : అభివృద్ధి చూపాలన్నా.. విమర్శించాలన్నా.. ఎన్నికల్లో పాటే ఆయుధం
X
పాట మనిషికి కదిలిస్తుంది.. చైతన్య పరుస్తుంది.. మార్పు తీసుకొస్తుంది.. అనేది వాస్తవం. చరిత్రలో జరిగిన తిరుగుబాట్లు, యుద్ధాలకు పాట ఆయుధమై ఊపిరి పోసింది. ఇప్పుడు ఆ ఆయుధాన్నే తెలంగాణ ఎన్నికల ప్రచారానికి వాడుతున్నారు. అన్ని పార్టీలు తమ క్యాంపెయినింగ్ లో పాటలను తప్పనిసరి చేశాయి. భారీగా ఖర్చు చేస్తూ పార్టీపై పాటలు రాయించుకుంటున్నాయి. అభ్యర్థులు కూడా అదే బాటపట్టారు. తమ పేర్లు, పార్టీ గుర్తు, చేసిన పనులను గుర్తు చేసేలా లిరిక్స్ రియిస్తున్నారు. ట్యూన్ చేసి ప్రచారాల్లో వాడుతున్నారు. అలా క్రియేట్ చేసిన పాటల్లో సూపర్ హిట్ అయినవీ ఉన్నాయి. మంచి బీట్, ఊపు తెప్పిస్తుండటంతో.. అభ్యర్థి ఎవరు, ఏ పార్టీ అనేది అవసరం లేకుండా జనాలు కూడా పాడేస్తున్నారు. యూట్యూబ్, సోషల్ మీడియాల్లో ట్రెండ్ చేస్తున్నారు. దాంతో ఎక్కడ చూసినా ఈ పాటలే వినిపిస్తున్నాయి. ఇక ప్రతిపక్ష పార్టీ హిట్ కావడంతోనే ఇతర పార్టీలు వాటికి పేరడీలు, కౌంటర్ సాంగ్స్ తెరపైకి తీసుకొస్తున్నాయి. ప్రచార రథాల్లో వాటిని ప్లే చేస్తున్నాయి. దీంతో పాటల రూపంలో కూడా ప్రత్యర్థిని విమర్శించే అవకాశం దొరుకుతుంది. ఈ ట్రెండ్ తో కొత్త కవులు, రచయితలు, కవులకు ఉపాది లభిస్తుంది.
TS Assembly Elections ౨౦౨౩ TS Assembly Elections 2023తెలంగాణ ఉద్యమంలో మొదలైన పాటల పాత్ర.. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొనసాగుతుంది. 2018లో బీఆర్ఎస్ పార్టీ మహాకూటమికి వ్యతిరేకంగా పాటలు రాయించుకుంది. వాడెవ్వడో వచ్చి కూటమి పెడితే అనే పాటతో ప్రజల్లో ప్రతిపక్షాలపై వ్యతిరేకత తీసుకొచ్చింది. ఆ పాటలే బీఆర్ఎస్ మెజార్టీ స్థానాల్లో గెలిచేలా చేశాయని అంటుంటారు. ప్రస్తుతం బీఆర్ఎస్ కూడా అదే పనిలో పడింది. తాజాగా ఆ పార్టీ తీసుకొచ్చిన గులాబీల జెండలే రామక్కా.. చల్ ధేక్ లేంగే పాటలు సూపర్ హిట్ అయ్యాయి. సోషల్ మీడియాలో చాలామంది రీల్స్ చేస్తున్నారు. ఈ పాటలతో పార్టీ చేసిన అభివృద్ధితో పాటు, ఉద్యమ సమయంలో కేసీఆర్ పాత్రను గుర్తు చేస్తున్నాయి.
ఇక ప్రతిపక్షాలు కూడా అదే పని చేస్తున్నాయి. బీఆర్ఎస్ రిలీజ్ చేసిన పాటలకు పేరడీలు, కౌంటర్లు తయారు చేయించడే కాకుండా.. వారి పార్టీకి అనుగుణంగా కొత్త పాటలను రూపొందించుకుంటున్నారు. బీఆర్ఎస్ గులాబీల జెండలే పాటకు.. కాంగ్రెస్ పార్టీ గులాబీల దొంగలే పేరడీని తీసుకొచ్చింది. ప్రస్తుతం ఆ పాటకూడా హిట్ అయింది. ప్రతిపక్షాలు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఈ పాటలను వాడుకుంటున్నారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల వ్యూహాల్లో పాటల పాత్ర మొదలయింది. అన్ని సభలు, ప్రచారాల్లో పాటలను ప్రమోట్ చేస్తూ ప్రజల దృష్టిని ఆకర్శిస్తున్నాయి.