Tammineni Veerabhadram : ఓటు హక్కు వినియోగించుకోని తమ్మినేని వీరభద్రం
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్.. సాయంత్రం 5 గంటలకు ముగిసింది. 5 గంటల సమయానికి క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. పలు ప్రాంతాలు మినహా.. రాష్ట్రమంతా ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. రాష్ట్రం మొత్తంలో దాదాపు 70 శాతం పోలింగ్ నమోదైంది. సామాన్య ప్రజలు, ప్రముఖులు, పార్టీల నేతలంతా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, ఆ పార్టీ పాలేరు అభ్యర్థి తమ్మినేని వీర భద్రం మాత్రం తన ఓటు హక్కును వినియోగించుకోలేదని తెలుస్తుంది. ఓటరు ఐడీలో తప్పులున్న కారణంగా తమ్మినేని ఓటు వేయలేకపోయినట్లు సమాచారం. ఇటీవలే తమ్మినేని హైదరాబాద్ నుంచి తన ఓటును సొంతూరు తెల్దారుపల్లికి మార్చుకున్న విషయం తెలిసిందే. కాగా తన ఓటరు ఐడీలో తప్పుల కారణంగా ఆయన ఓటు వేయకుండానే వెనుదిరిగారు. అధికారుల తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.