TS Assembly Elections 2023 : తెలంగాణ తుది ఫలితాలు.. 19 నుంచి 64కు పెరిగిన ‘చేయి’
X
తెలంగాణ అసెంబ్లీ ఫలితాలు వచ్చేశాయి. ఇంకా ఆరేడు స్థానాల్లో కౌంటింగ్ సాగుతున్నా అక్కడ కూడా ఆయా పార్టీల అభ్యర్థులు స్పష్టమైన మెజారిటీతో కొనసాగుతున్నారు. అనూహ్య ఫలితాలు వస్తే తప్ప మార్పుకు అవకాశం లేదు. శాసనసభలోని మొత్తం 119 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ 64, బీఆర్ఎస్ 39, బీజేపీ 8, ఎంఐఎం 7, సీపీఐ 1 స్థానంలో గెలిచాయి. కాంగ్రెస్‌కు సీపీఐతో పొత్తు ఉండడంతో దాని బలం 65కు చేరింది.
సీల్లో ప్లస్, మైనస్
2018లో 19 సీట్లతో సరిపెట్టుకున్న కాంగ్రెస్ ఈసారి అదనంగా 45 స్థానాలను కైవసం చేసుకుంది.
గత ఎన్నికల్లో 88 సీట్లలో గెలించిన బీఆర్ఎస్ ఈసారి 49 సీట్లను కోల్పోయింది. గత ఎన్నికల్లో
గత ఎన్నికల్లో కేవలం 1 సీటు గెలుచుకున్న బీజేపీ ఈసారి 7 అదనంగా సాధించింది.
ఎంఐఎం పార్టీకీ గత ఎన్నికల్లో మాదిరే ఈ ఎన్నికల్లో 7 సీట్లు దక్కయి.
తాజా ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు పడిన ఓట్ల శాతం (కౌంటింగ్ పూర్తయితే స్వల్పంగా మారొచ్చు)
కాంగ్రెస్ పార్టీ 39.38 శాతం
బీఆర్ఎస్ 37.35 శాతం
బీజేపీ 13.90 శాతం
ఎంఐఎం 2.22 శాతం
సీపీఐ 0.34శాతం
బీఎస్పీ 1.37 శాతం
నోటా 0.73 శాతం