Home > తెలంగాణ > Telangana Elections 2023 > KCR : 'అంతా మాకు తెలుసులే అనుకోవద్దు..' అభ్యర్థులకు గులాబీ బాస్ దిశానిర్ధేశం

KCR : 'అంతా మాకు తెలుసులే అనుకోవద్దు..' అభ్యర్థులకు గులాబీ బాస్ దిశానిర్ధేశం

KCR : అంతా మాకు తెలుసులే అనుకోవద్దు.. అభ్యర్థులకు గులాబీ బాస్ దిశానిర్ధేశం
X

తెలంగాణలో మళ్లీ విజయం మనదేనని తెలంగాణ సీఎం కేసీఆర్ ధీమాను వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ ఆదివారం నాడు అభ్యర్థులతో భేటీ అయ్యారు. ఇప్పటికే 115 స్థానాల్లో అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. అయితే వేములవాడలో న్యాయపరమైన ఇబ్బందులతో ఆ స్థానంలో అభ్యర్ధిని మార్చాల్సి వచ్చిందని సీఎం కేసీఆర్ చెప్పారు. టిక్కెట్లు దక్కని వారు ఇబ్బంది పడొద్దని సీఎం కేసీఆర్ సూచించారు. అసంతృప్తి చెందినవారిని పార్టీ నేతలు వారితో మాట్లాడాలని సీఎం కేసీఆర్ కోరారు. కార్యకర్తల నుండి నేతల వరకు అందరిని సమన్వయం చేసుకోవాలని ఆయన కోరారు. సామరస్యపూర్వకంగా సీట్ల సర్ధుబాటు చేసుకోవాలన్నారు. కోపతాపాలను అభ్యర్థులను పక్కన పెట్టాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఎన్నికల ఘట్టంలో చాలా కీలకంగా వ్యవహరించాలన్నారు. అఫిడవిట్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని కోరారు. సాంకేతికంగా దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. వనమా నాగేశ్వరరావు, కృష్ణమోహన్ రెడ్డి లపై ఇటీవల వచ్చిన హైకోర్టు తీర్పుల విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు.

ఎన్నికల వేళ అభ్యర్థులకు ఓపిక, సంయమనం అవసరమన్నారు. ఓ ఎన్నికకు మరో ఎన్నికకు నిబంధనలు మారుతుంటాయని.. కాబట్టి అభ్యర్థులు ప్రతీదీ తెలుసుకోవాలన్నారు. అన్నీ తెలిసినట్లు తొందరపడొద్దని తెలిపారు. వేములవాడలో న్యాయపరమైన ఇబ్బందులతో ఆ స్థానంలో అభ్యర్ధిని మార్చాల్సి వచ్చిందని సీఎం చెప్పారు. టిక్కెట్లు దక్కని వారు ఇబ్బంది పడొద్దని సీఎం సూచించారు. అసంతృప్తి చెందినవారిని పార్టీ నేతలు, అభ్యర్థులు వారితో మాట్లాడాలని సీఎం కేసీఆర్ కోరారు. సీట్లు రాని వారికి అనేక అవకాశాలుంటాయన్నారు. గతంలో జూపల్లి కృష్ణారావుకు తాము చేసిన సూచనను పట్టించుకోలేదన్నారు. కార్యకర్తల నుండి నేతల వరకు అందరిని సమన్వయం చేసుకోవాలని ఆయన కోరారు. సామరస్యపూర్వకంగా సీట్ల సర్ధుబాటు చేసుకోవాలన్నారు.

ఇవాళ్టి వ‌ర‌కు 51 బీ-ఫారాలు మాత్ర‌మే రెడీ అయ్యాయ‌ని, మిగ‌తావి రేపు అందిస్తామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. ఇక బీ-ఫారాలు నింపేట‌ప్పుడు జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.. పొర‌పాటు చేయొద్ద‌ని కేసీఆర్ సూచించారు. శ్రీనివాస్ గౌడ్, వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర్ రావు, కృష్ణ‌ మోహ‌న్ రెడ్డి మీద కేసులు పెట్టారని కేసీఆర్ గుర్తు చేశారు. గెల‌వ‌లేక కోర్టుల్లో కేసులు వేసి ఇబ్బంది పెట్టారు. సాంకేతికంగా కార‌ణాలు చూపి, ఇబ్బంది పెట్టే ప్ర‌య‌త్నం చేశారు. మీకు గైడ్ చేయ‌డానికి న్యాయ‌వాదులు అందుబాటులో ఉంటారు. వారితో మాట్లాడి, తెలియ‌ని విష‌యాలు తెలుసుకోవాలి. ఎన్నిక‌లు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా త‌మాషాలు చూస్తుంటాం. ఈ ఎన్నిక‌ల్లో నిబంధ‌న‌లు మారుస్తుంటారు. ప్ర‌తిది తెలుసుకునే ప్ర‌య‌త్నం చేయాలి. మాకు తెలుసులే అని అనుకోవ‌ద్దు. 98480 23175 నంబ‌ర్‌కు ఫోన్ చేస్తే భ‌ర‌త్ కుమార్ 24 గంట‌లు అందుబాటులో ఉంటారు. మ‌న పార్టీకి, ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు మ‌ధ్య వార‌ధిగా భ‌ర‌త్ కుమార్ ప‌ని చేస్తున్నారు.అభ్య‌ర్థుల‌కు సందేహాలు వ‌స్తే ఒక్క ఫోన్ కొడితే నిమిషాల్లోనే ప‌రిష్కారం చూపిస్తారని చెప్పారు.




Updated : 15 Oct 2023 1:04 PM IST
Tags:    
Next Story
Share it
Top