Home > తెలంగాణ > Telangana Elections 2023 > TS Assembly Elections 2023 : తెలంగాణలో ముగిసిన పోలింగ్.. 3న ఫలితాలు

TS Assembly Elections 2023 : తెలంగాణలో ముగిసిన పోలింగ్.. 3న ఫలితాలు

TS Assembly Elections 2023   : తెలంగాణలో ముగిసిన పోలింగ్.. 3న ఫలితాలు
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ 5 గంటలకు ముగిసింది. చిన్నచిన్న ఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. పలుచోట్ల బీఆర్ఎస్- కాంగ్రెస్ మధ్య ఘర్షణలు తలెత్తగా.. పోలీసుల రంగప్రవేశంతో సద్ధుమణిగాయి. 5గంటల వరకు క్యూలైన్లో ఉన్నవారికి అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. వరంగల్‌, నల్లగొండలో క్యూలైన్లలో ఓటర్లు భారీగా ఉన్నారు. పోలింగ్ ప్రక్రియ ముగియడంతో అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. డిసెంబర్ 3న ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. మొత్తం 2,290 అభ్యర్థుల భవితవ్యం ఆ రోజే తేలనుంది.


Updated : 30 Nov 2023 5:51 PM IST
Tags:    
Next Story
Share it
Top