Telangana Assembly : అసెంబ్లీ వాయిదా.. స్పీకర్ ఎన్నిక ఎప్పుడంటే..?
X
తెలంగాణ అసెంబ్లీ వాయిదా పడింది. ఈ నెల 14న సభ తిరిగి ప్రారంభం కానుంది. అదే రోజున స్పీకర్ను ఎన్నుకోనున్నారు. డిసెంబర్ 15న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించనున్నారు. ఆ మరుసటి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టి చర్చిస్తారు. స్పీకర్ ఎన్నిక అనంతరం సభ ఎన్ని రోజులు నిర్వహించాలన్న అంశంపై బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు.
శనివారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రారంభమైంది. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించారు. ముందుగా సీఎం రేవంత్ రెడ్డి, తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత వరుసగా మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు. మాజీ సీఎం కేసీఆర్‌కు హాస్పిటల్లో ఉన్నందున ఆయనతో పాటు కేటీఆర్ సభకు రాలేదు. ప్రమాణ స్వీకారానికి తనకు మరో రోజు సమయం ఇవ్వాలని కేటీఆర్ అసెంబ్లీ సెక్రటరీని కోరారు.