Home > తెలంగాణ > Telangana Elections 2023 > Assembly Election 2023 : సోషల్ మీడియాలో ఎన్నికల ప్రచారంపై వికాస్ రాజ్ ఏం చెప్పారంటే..?

Assembly Election 2023 : సోషల్ మీడియాలో ఎన్నికల ప్రచారంపై వికాస్ రాజ్ ఏం చెప్పారంటే..?

Assembly Election 2023 : సోషల్ మీడియాలో ఎన్నికల ప్రచారంపై వికాస్ రాజ్ ఏం చెప్పారంటే..?
X

సోషల్ మీడియాలో ప్రచారంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ స్పందించారు. ప్రచార గడువు ముగిసినందున సోషల్ మీడియాలోనూ ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేయడం నిషిద్ధమని ప్రకటించారు. ఈసీ అనుమతి పొందిన ప్రకటనలకు మాత్రమే అవకాశముందని స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనలు, ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను వికాస్ రాజ్ వెల్లడించారు.

ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఎలాంటివి అడ్వర్జైజ్మెంట్లు చేయొద్దని వికాస్ రాజ్ స్పష్టం చేశారు. టీవీలు, రేడియోలు, కేబుల్‌ నెట్‌వర్క్‌ల్లో ప్రచారం నిషిద్ధమని చెప్పారు. ఓటరు స్లిప్పులపై పార్టీల గుర్తులు ఉండొద్దని, పోలింగ్‌ ముగిసిన అరగంట వరకు ఎగ్జిట్‌పోల్స్‌పై నిషేధం కొనసాగుతుందని ప్రకటించారు. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందిలో 1.48 లక్షల మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 27,094 కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌, 7,571 ప్రాంతాల్లో పోలింగ్ స్టేషన్ బయట కూడా వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాటు చేశామని వికాస్ రాజ్ వెల్లడించారు.




Updated : 28 Nov 2023 1:02 PM GMT
Tags:    
Next Story
Share it
Top