TS Assembly Elections 2023 : పోలింగ్ రోజున సెలవు ఇవ్వకుంటే కఠిన చర్యలు - సీఈఓ వికాస్ రాజ్
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఈ నెల 30న రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, ఐటీ కంపెనీలు సెలవు ప్రకటించాలని ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాలు జారీ చేశారు. ఆయా కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని సంస్థలు సెలవు ఇవ్వాని వికాస్ రాజ్ స్పష్టం చేశారు. సెలవు ఇవ్వని సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు
2018 అసెంబ్లీ, 2019 లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సమయంలో కొన్ని సంస్థలు సెలవు ఇవ్వనట్లు తమకు ఫిర్యాదులు అందినట్లు సీఈఓ వికాస్ రాజ్ చెప్పారు. ఈ క్రమంలో ఈసారి అన్ని సంస్థలు సెలవు ఇచ్చాయో లేదో పరిశీలించాలని కార్మిక శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉంటే ఎన్నికల దృష్ట్యా హైదరాబాద్‌లోని అన్ని విద్యా సంస్థలకు 2 రోజులు సెలవు ప్రకటించారు. జిల్లా పరిధిలోని అన్ని విద్యాసంస్థలకు బుధ, గురువారాల్లో సెలవు ప్రకటిస్తూ హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ ఉత్తర్వులు జారీ చేశారు.