Home > తెలంగాణ > Telangana Elections 2023 > KCR :కదనరంగంలోకి కేసీఆర్.. నేడే ప్రచారం షురూ

KCR :కదనరంగంలోకి కేసీఆర్.. నేడే ప్రచారం షురూ

KCR :కదనరంగంలోకి కేసీఆర్.. నేడే ప్రచారం షురూ
X

నిన్నటి వరకూ ఒక లెక్క.. ఇక ఈ రోజు నుంచి మరో లెక్క అన్నట్టుగా మారిపోయింది తెలంగాణ రాజకీయం. మరో నెలలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి .. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్‌ కాగా... ప్రధాన పార్టీలన్ని గెలుపే లక్ష్యంగా దూకుడు పెంచాయ్. ఇక ఇవాళ్టి నుంచి బీఆర్ఎస్ అధినేత, గులాబీ బాస్ కేసీఆర్ ఎన్నికల కదనరంగంలోకి దిగబోతున్నారు. ఇవాళ్టి నుంచి కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. అధినేత నేరుగా రంగంలోకి దిగనున్న నేపథ్యంలో.... పార్టీ శ్రేణుల్లో మరింత జోష్ ను నింపబోతున్నారు.

సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ..

ఈ రోజు నుంచి నవంబర్ 9 వరకు 42 నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు సీఎం కేసీఆర్. నవంబర్ 11న గజ్వేల్ , కామారెడ్డి స్థానాలకు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ముచ్చటగా మూడోసారి సీఎం కేసీఆర్ సెంటిమెంట్ నియోజకవర్గం అయిన హుస్నాబాద్ నుంచి ఎన్నికల ప్రచారాన్నిప్రారంభించనున్నారు. 2014 మరియు 2018లో రెండుసార్లు హుస్నాబాద్ నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన కేసీఆర్ విజయం సాధించారు. మరోసారి కూడా ఇక్కడ్నుంచే ప్రారంభించాలని నిర్ణయించారు కేసీఆర్. మొత్తం 17 రోజుల్లో 42 సభల్లో పాల్గొననున్నారు కేసీఆర్. మరోవైపు కేసీఆర్ సభ కోసం ఏర్పాట్లను పూర్తి చేశారు స్థానిక నేతలు. ఈ సభ కోసం భారీగా జనసమీకరణ చేస్తున్నారు.

మధ్యాహ్నమే మేనిఫెస్టో విడుదల

ఇవాళ మధ్యాహ్నం 12.15 గంటలకు బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు కేసీఆర్. ఇందులో కీలక హామీలను ప్రకటించే అవకాశం ఉంది. ఈసారి మేనిఫెస్టోలో ప్రధానంగా రైతులకు పెద్దపీఠ వేస్తారని తెలుస్తోంది. ముఖ్యంగా రైతులకు ఫించన్లు ఇచ్చే విషయంపై ప్రకటన ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ప్రస్తుతం ఇస్తున్న రైతుబంధు(ఏడాదికి రూ.16,000)ను పెంచటంతో పాటు మరిన్ని కొత్త స్కీమ్ లు ప్రకటిస్తారని సమాచారం. రుణమాఫీపై కూడా మరోసారి ప్రకటన చేస్తారని తెలుస్తోంది.

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్‌ కిట్ల మొత్తాన్ని పెంచడంతో పాటు రైతులందరికీ పింఛన్‌ ఇవ్వాలనే ప్రతిపాదన సాధ్యాసాధ్యాలపై అధ్యయనం పూర్తయినట్లు తెలిసింది. రైతుబంధు, సామాజిక పింఛన్లు ఎంత మేర పెంచాలనే అంశంపై సీఎం కేసీఆర్‌ తుది నిర్ణ యం తీసుకోవాల్సి ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డు ఇచ్చే విషయంపై గులాబీ బాస్ కసరత్తు చేస్తున్నారట! ఇవే కాకుండా ఆసరా పెన్షన్ల పెంపుతో పాటు....రాష్ట్రంలోని పలు వర్గాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఆకర్షించే పథకాలను ప్రకటించే అవకాశం ఉందంట. కల్యాణలక్ష్మి కింద ఇస్తున్న ఆర్థిక సాయాన్ని కూడా పెంచే అంశం మేనిఫెస్టోలో ప్రస్తావించటంతో పాటు... దళితబంధు, బీసీ బంధు, మైనారిటీ బంధును మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా ప్రకటనలు ఉంటాయని తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు... జర్నలిస్టులకు సంబంధించిన అంశాలు మేనిఫెస్టోలో పొందుపర్చినట్లు సమాచారం.




Updated : 15 Oct 2023 7:23 AM IST
Tags:    
Next Story
Share it
Top