TS Assembly Elections 2023 : సీఐపీకి చెన్నూరు, కొత్తగూడెం ఇచ్చేసిన కాంగ్రెస్.. నారాయణ వెల్లడి
X
కాంగ్రెస్‌తో సీపీఐ సీట్ల పంచాయతీ పూర్తయింది. కొత్తగూడెం, చెన్నూరు సీట్లు తమకు ఇవ్వడానికి కాంగ్రెస్ అంగీకరించిందని సీపీఏ జాతీయ కార్యదర్శి నారాయణ బుధవారం మీడియాకు చెప్పారు. మునుగోడుతోపాటు మరికొన్ని సీట్లు కోరామని కొందరు ఏవేవో ప్రచారం చేస్తున్నారని, అలాంటిదేమీ లేదని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ దొందూ దొందేనని నారాయణ మండిపడ్డారు. వాటి మధ్య లోపాయికారి ఒప్పందం ఉంది కనుకే కల్వకుంట్ల కవిత జైలుకుపోకుండా బయటే ఉన్నారని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి, అవినాశ్ రెడ్డి కూడా బీజేపీకి కొమ్ము కాస్తున్నారని, అందుకే మోదీ ప్రభుత్వం వారి అక్రమాలను చూసీచూడనట్టు పోతోందని అన్నారు.
కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మధ్య సీట్ల పంపకం చర్చలు కొలిక్కి వచ్చాయని, ఈ రోజు(బుధవారం) కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా విడుదల కానుందని వార్తలు వస్తున్నాయి. సీపీఎం, కాంగ్రెస్ మధ్య సీట్ల పంపిణీపై కూడా కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. మిర్యాలగూడ, భద్రాచలం, పాలేరు సీట్లను తమకివ్వాలని సీపీఎం కోరుతుండగా పాలేరును ఇచ్చే ప్రసక్తే లేదని కాంగ్రెస్ చెబుతోంది. కొత్తగూడెం నుంచి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరాలు 2009లో ఎమ్మెల్యేగా గెలిచారు. చెన్నూరు నుంచి సీపీఐ అభ్యర్థులెవరూ ఇంతవరకు గెలవలేదు.