Revanth Reddy : రేవంత్ రెడ్డి ఇంటికి డీజీపీ అంజన్ కుమార్
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. 65 స్థానాల్లో హస్తం పార్టీ హవా కొనసాగుతోంది. దీంతో ఆ పార్టీ నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటికి భారీగా తరలివస్తుండటంతో ఇంటి దగ్గర పోలీసులు భారీ భద్రతను పెంచారు. అటు కామారెడ్డి, ఇటు కొడంగల్ నియోజకవర్గాల్లోనూ రేవంత్ ఆధిక్యంలో ఉన్నారు. కొడంగల్ లో 20,923 ఓట్ల ఆధిక్యంలో రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు. ఇదే క్రమంలో తెలంగాణ డీజీపీ అంజన్ కుమార్ సహా ఐపీఎస్ అధికారులు మహేష్ భగవత్, సంజయ్ కుమార్ జైన్ లు రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఆయనకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో దూసుకెళ్తున్న నేపథ్యంలో ఆ తర్వాత కార్యాచరణను కేంద్ర నాయకుల నిర్ణయం మేరకు తీసుకుంటామని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు.