Home > తెలంగాణ > Telangana Elections 2023 > Telangana Election 2023: నిన్నటి దాకా మత రాజకీయం.. నేడు కుల రాజకీయం.. ప్రధానిపై కేటీఆర్ ఫైర్

Telangana Election 2023: నిన్నటి దాకా మత రాజకీయం.. నేడు కుల రాజకీయం.. ప్రధానిపై కేటీఆర్ ఫైర్

Telangana Election 2023:  నిన్నటి దాకా మత రాజకీయం.. నేడు కుల రాజకీయం.. ప్రధానిపై కేటీఆర్ ఫైర్
X

బీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించిన ప్ర‌ధాని నరేంద్ర మోడీపై మంత్రి కేటీఆర్ ఎదురుదాడికి దిగారు. బీసీ ముఖ్య‌మంత్రి అంశాన్ని లేవ‌నెత్తిన బీజేపీతో బీసీల‌కు ఒరిగిందేమీ లేద‌ని అన్నారు. హైదరాబాద్​లో బీజేపీనిర్వహించిన బీసీ ఆత్మీయ సభలో ప్రధాని మోదీ మరోసారి బీసీ సీఎం అనే మాట ఎత్తడంతో మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. 'రాష్ట్రానికి రాహుల్ ​గాంధీ వచ్చి బీఆర్ఎస్ పార్టీ.. బీజేపీకి బీ టీమ్ అంటారు.. ప్రధానమంత్రి మోదీ వచ్చి.. తాము కాంగ్రెస్​కు సీ టీమ్ అంటారు.. మేము బీజేపీకి బీ టీమ్ కాదు, కాంగ్రెస్​కు సీ టీమ్ కాదు' అంటూ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తమది ముమ్మాటికీ టీ టీమ్.. తెలంగాణ టీమ్ అని ఎక్స్(ట్విటర్)లో వివరించారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసం ఎవరితోనైనా ఎక్కడి దాకైనా పోరాడే ఏకైక టీమ్ బీఆర్ఎస్ పార్టీదే అని తెలిపారు. నిన్నటి దాకా మత రాజకీయం చేశారని.. ఇక ఇప్పుడు కుల రాజకీయానికి తెర తీశారని ప్రధాని నరేంద్ర మోదీపై కేటీఆర్ విరుచుకుపడ్డారు.

పదేళ్ల బీజేపీ హయాంలో దేశంలోని బీసీలకు మిగిలింది వేదన మాత్రమేనని కేటీఆర్ విమర్శించారు. బీసీల జనగణన కూడా చేయని పాలన బీజేపీది అని.. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను పెట్టని ప్రభుత్వం.. బీజేపీ ప్రభుత్వం అంటూ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. అందుకే బీజేపీ ముమ్మాటికీ బీసీల వ్యతిరేక పార్టీయేనని ఆయన అన్నారు. బీసీలంటే ఆ పార్టీ దృష్టిలో బలహీనవర్గాలు.. కానీ, తమకు బీసీలంటే బలమైన వర్గాలని ప్రధానిమంత్రికి తెలియదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని బీసీలకు పదవులే కాదు.. అనేక పథకాలిచ్చిన సర్కార్ బీఆర్ఎస్​ది అని వివరించారు.

టీఎస్​పీఎస్సీ పేపర్లు లీక్ చేసిందే బీజేపీ నేతలని.. నిందితులతో వేదిక పంచుకుని తమపై నిందలు వేయడం ఆశ్చర్యం కలిగిస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. దర్యాప్తు సంస్థల దుర్వినియోగంలో బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్​నే మించిపోయిందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం ఒక్కసారి కూడా రైతుల కోసం రుణమాఫీ చేయలేదని, 2 సార్లు రైతులకు రుణామాఫీ చేసిన బీఆర్ఎస్ సర్కారుపై విమర్శలు చేయడం నిజంగా విడ్డూరంగా ఉందని మంత్రి కేటీఆర్ ట్వీట్​లో పేర్కొన్నారు.




Updated : 8 Nov 2023 6:05 AM GMT
Tags:    
Next Story
Share it
Top