TS Assembly Elections 2023 : 'ఏది కావాలి మనకు? ఆలోచించు తెలంగాణ రైతన్నా..' KTR ట్వీట్
X
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రైతాంగాన్ని ఉద్దేశిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, కర్ణాటకలో కాంగ్రెస్ అమలు చేస్తున్న రైతు సంక్షేమాలను కంపేర్ చేస్తూ.. ఏది కావాలో ఎంచుకోవాలని సూచించారు.
'ఏది కావాలి మనకు? ఆలోచించు తెలంగాణ రైతన్నా.. కెసిఆర్ గారు కడుపునిండా ఇస్తున్న 24 గంటల ఉచిత కరెంటు కావాల్నా ? లేక కర్ణాటకలో కాంగ్రెస్ ఇస్తున్న 5 గంటల కరెంటు కావాల్నా ?
లేకపోతె తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు చెప్పిన 3 గంటల కరెంటు కావాల్నా ? ఆలోచించు తెలంగాణ రైతన్నా.. ఆరు దశాబ్దాలు ఆగం చేసిన వాళ్ళు కావాల్నా ? కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్సఫార్మర్లు మళ్ళి ఆ రోజులు రావాల్నా? లేదా రైతుబంధు నిచ్చి, రైతుభిమా తెచ్చి, చెరువులు బాగుచేసి, ప్రాజెక్టులు కట్టి, నెర్రెలు బారిన నేలను సస్యశామలం చేసిన కెసిఆర్ కావాల్నా’ అని కేటీఆర్ పేర్కొన్నారు.