KCR : తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ - సీఎం కేసీఆర్
X
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన పదేళ్లలో అన్ని రంగాల్లో దూసుకుపోతోందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగా అద్బుత ఫలితాలు వస్తున్నాయని అన్నారు. నిజామాబాద్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు. ఐటీ రంగంలో హైదరాబాద్ త్వరలోనే బెంగళూరును దాటిపోతామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి కీలక సూచిక అయిన తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలో నెంబర్ వన్ స్థానంలో ఉందని కేసీఆర్ స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని కేసీఆర్ చెప్పారు. 50 ఏండ్లకుపైగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజల కోసం ఏం చేసిందో.. పదేండ్లు పాలించిన బీఆర్ఎస్ ఎంత అభివృద్ధి చేసిందో ప్రజలే గుర్తించాలని అన్నారు. రాష్ట్రం ఏర్పడేనాటికి నీళ్లు, నిధులు, కరెంటు కోతలు, రైతుల ఆత్మహత్యలు, గల్ఫ్కు వలసలు ఉండేవని కానీ ఇప్పుడా పరిస్థితి లేదని చెప్పారు. రూ.200 ఉన్న పెన్షన్ ను రూ.2వేలకు పెంచడంతో పాటు నీటి పన్ను రద్దు, వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్, పెట్టుబడి సాయం కోసం రైతు బంధు ఇస్తున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు.
మానవీయ కోణంలో అనేక పథకాలు అమలు చేస్తున్నామన్న కేసీఆర్.. రాష్ట్ర సంపద పెరిగే కొద్దీ కొత్త స్కీంలు, లబ్ది పొందే మొత్తాన్ని పెంచుతూ పోతున్నామని అన్నారు. డిచ్పల్లిలో
మానవీయ కోణంలో అనేక పథకాలు అమలు చేస్తున్నాం3,085 ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇచ్చామని చెప్పారు. తండాలను పంచాయితీలుగా మార్చడంతో పాటు గిరిజనులకు 10శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. మళ్లీ అధికారంలోకి వస్తే ఆసరా పింఛనును విడతలవారీగా రూ.5వేలకు పెంచడంతో పాటు అన్ని వర్గాలకు కేసీఆర్ బీమా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.