TS Assembly Elections 2023 : తెలంగాణలో 70.66 శాతం పోలింగ్.. అత్యధికంగా ఏ జిల్లాలో నమోదైందంటే..
X
తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. కొన్ని ప్రాంతాలు మినహా మిగతా రాష్ట్రమంతా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఈసీ ప్రకటించిన పోలింగ్ డే (హాలిడే)ను ప్రజలు వినియోగించుకున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో (నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు) సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగగా.. మిగతా ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటలవరకు పోలింగ్ స్టేషన్ల వద్ద క్యూలైన్లనలో నిల్చున్న చివరి వ్యక్తి వరకు ఓటేసే అవకాశం కల్పించారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 10 వరకు ఓటర్లు క్యూలైన్లలో నిల్చొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 70.66 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ ప్రకటించింది. అత్యధికంగా యాదాద్రి జిల్లాలో 90.03 శాతం ఓటింగ్ నమోదు కాగా.. హైదరాబాద్ లో అత్యల్పంగా 46.56 శాతం నమోదయింది. నియోజకవర్గాల వారీగా చూస్తే ఎక్కువగా మునుగోడులో 91.51 శాతం పోలింగ్ జరగ్గా.. యాకుత్ పురాలో 39.9 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ అధికారులు తెలిపారు. 2018 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 73.37 శాతం పోలింగ్ నమోదైంది.
జిల్లాల వారీగా పోలింగ్ శాతం ఇలా...
• యాదాద్రి – 90.03
•మెదక్ – 86.69
• జనగాం – 85.74
• నల్గొండ – 85.49
• సూర్యాపేట – 84.83
• మహబూబాబాద్ – 83.70
• ఖమ్మం – 83.28
• ములుగు – 82.09
• భూపాలపల్లి – 81.20
• గద్వాల్ – 81.16
• ఆసిఫాబాద్ – 80.82
• సిద్దిపేట – 79.84
• కామరెడ్డి – 79.59
• నాగర్ కర్నూల్ – 79.46
• భద్రాద్రి – 78.65
• నిర్మల్ – 78.24
• వరంగల్ – 78.06
• మహబూబ్‌నగర్ – 77.72
• వనపర్తి – 77.64
• నారాయణపేట – 76.74
• పెద్దపల్లి – 76.57
• వికారాబాద్ – 76.47
• సంగారెడ్డి – 76.35
• సిరిసిల్ల – 76.12
• జగిత్యాల – 76.10
• మంచిర్యాల – 75.59
• కరీంనగర్ – 74.61
• నిజామాబాద్ – 73.72
• హనుమకొండ – 66.38
• మేడ్చల్ – 56
• రంగారెడ్డి – 59.94
• హైదరాబాద్ 46.56