ఆర్టీసీ బస్సుల్లో ఇక క్యాష్‌లెస్ జర్నీ..
X
ఎక్కడ చూసినా జేబుల్లోంచి రూపాయి కూడా బయటికి తీయకుండా క్యూఆర్ కోడ్లు, స్వైప్ మిషన్లతో లావాదేవీలు సాగిపోతున్నాయి. గంగిరెద్దుల వాళ్లు కూడా, చిల్లర లేదని చెబితే ఫోన్ పే చేయండి అంటున్నారు. మరి, రోజూ లక్షల మంది ప్రయాణించే ఆర్టీసీ బస్సుల్లో మాత్రం ఈ క్యాష్‌లెస్ సదుపాయం ఉండొద్దా అంటూ తెలంగాణ ఆర్టీసీ కూడా ముందడగు వేసింది. ఆర్టీసీ బస్సుల్లో తరచూ చిల్లర సమస్య వల్ల జరుగుతున్న గొడవలకు కూడా ఇది చక్కని పరిష్కారం.
సంస్థ బస్సుల్లో నగదు లేకుండానే ప్రయాణించే సదుపాయాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఆర్టీసీ లాంఛనంగా ప్రారంభించింది. పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ సహా అన్ని బస్సులలో ఐ-టిమ్స్ పరికరాలను తీసుకొస్తోంది. పైలట్ ప్రాజెక్టు కింద హైదరాబాద్ బండ్లగూడ డిపోలో ఈ సదుపాయాన్ని ప్రారంభించారు. డెబిట్, క్రెడిట్ కార్డులతోపాటు ఫోన్‌పే, గూగుల్‌పే వంటి వాటితో చెల్లింపులు చేయొచ్చు. బండ్లగూడ తర్వాతకంటోన్మెంట్ డిపోలో దీన్ని ప్రారంభిస్తారు. మొత్తం 8,300 బస్సుల్లో దశలవారీగా టిమ్స్ పరికరాలను తీసుకొస్తారు. దూరప్రాంతాలకు వెళ్లి సూపర్‌లగ్జరీ, ఏసీ బస్సుల్లోనే ప్రస్తుతం ఐ-టిమ్స్ ఉన్నాయి.