TS Assembly Elections 2023 : కుటుంబాలకు ఆశీర్వాదమే.. విమర్శలను పట్టించుకోని ఓటర్లు!
X
కుటుంబ పాలనపై విమర్శలు సహజమే. అన్ని పార్టీల్లోనూ వారసత్వాలు కొనసాగడంపై విమర్శలు, ప్రతివిమర్శలు సాగుతుంటాయి. తెలంగాణ ఎన్నికలు కూడా దీనికి అతీతం కాదు. కేసీఆర్‌ది కుటుంబ పాలన అని కాంగ్రెస్, కాంగ్రెస్‌ది గాంధీల పెత్తనమని బీఆర్ఎస్, బీజేపీలు దుమ్మెత్తిపోసుకున్నాయి. ఎన్నికల ఫలితాల సంగతెలా ఉన్నా కుటంబాలను ఓటర్లు ఆశీర్వదించినట్లే కనిపిస్తోంది. కేసీఆర్ ఫ్యామిలీతోపాటు కాంగ్రెస్ పార్టీలోని కొన్ని కుటుంబాలు కూడా గెలుపు బాటలో కొనసాగుతున్నాయి.
కేసీఆర్ గజ్వేల్‌లో ముందంజలో కొనసాగుతున్నారు. హరీశ్ రావు సిద్దిపేటలో 45,355 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సిరిసిల్లలో కేటీఆర్ ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ నాయకులైన కోమటిరెడ్డి సోదరులు కూడా విజయవైపు దూసుకెళ్తున్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండలో, రాజగోపాల్ రెడ్డి మునుగోడులో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఉత్తం కుమార్ రెడ్డి హుజూర్ నగర్ లో, ఆయన భార్య పద్మావరెడ్డి కోదాలో మెజారిటీ సాధిస్తున్నారు.. మంత్రి మల్లారెడ్డి మేడ్చల్‌లో ఆధిక్యంలో, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్‌గిరిలో ఆధిక్యంలో ఉన్నారు. కొన్నిచోట్ల కుటుంబాలకు ఓటర్లకు చెక్ పెడుతున్నారు మైనంపల్లి హనుమంతరావు మల్కాజ్‌గిరిలో ఓటమి బాటలో, కొడుకు రోహిత్ మెదక్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.