Breaking News : ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్
X
ఇవాళ తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయనుంది. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మిజోరాం రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. షెడ్యూల్ విడుదల అవ్వగానే 5 రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. తెలంగాణ, రాజస్థాన్, మిజోరం, మధ్యప్రదేశ్‌లో ఒకే విడతలో ఎన్నికలు జరిగే అవకాశాలుండగా.. ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు సమాచారం.
తెలంగాణలో ఇప్పటికే రాజకీయం వేడెక్కింది. అన్నీ పార్టీలు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదపుతున్నాయి. బీఆర్ఎస్ ఇప్పటికే 115 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల వేటలో తలమునకలయ్యాయి. ఈ సారి ఎలాగైన ప్రభుత్వాన్ని ఏర్పాటచేయాలని ప్రణాళికలు రచిస్తున్న కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో సరికొత్త విధానం పాటిస్తోంది. ఆశావాహులు దరఖాస్తులు చేసుకుని నెల దాటుతున్నా వడపోత కార్యక్రమం మాత్రం ఇంకా ముగియలేదు.