Rahul Gandhi ఆదాయం వచ్చే శాఖలన్నీ ఆ కుటుంబం దగ్గరే ఉన్నాయి - రాహుల్ గాంధీ
X
తెలంగాణలో ల్యాండ్, శాండ్, వైన్స్ మాఫియా నడుస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బోధన్ లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కువ ఆదాయం వచ్చే శాఖలన్నీ కేసీఆర్ కుటుంబసభ్యుల దగ్గరే ఉన్నాయని విమర్శించారు. దళిత బంధు స్కీంలో అధికార పార్టీ ఎమ్మెల్యే రూ.3లక్షలు కమిషన్ తీసుకుంటున్నారని మండిపడ్డారు.కుటుంబ, అవినీతి పాలన వల్ల రాష్ట్రం ఎంతో నష్టపోయిందని రాహుల్ అభిప్రాయపడ్డారు.
ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను ఎస్సీల కోసం ఖర్చు చేయలేదని రాహుల్ విమర్శించారు. బీఆర్ఎస్, బీజేపీ పాలనలో గ్యాస్ సిలిండర్ ధర రూ.1200లకు చేరిందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
#WATCH | Nizamabad, Telangana: While addressing a public meeting, Congress MP Rahul Gandhi says,"...The ministries that make the most money are under the KCR family... A large amount of money is made in land, liquor, and sand...All three ministries are under the KCR family... If… pic.twitter.com/nBwlbwkini
— ANI (@ANI) November 25, 2023