Manda Krishna Madiga : ఎమ్మార్పీఎస్ ప్రచారంతోనే బీజేపీకి 8 సీట్లు.. మందకృష్ణ మాదిగ
X
బీజేపీకి ఎమ్మార్పీఎస్ ప్రచారం చేయడంతోనే ఓటు శాతం పెరిగి కమలం పార్టీ 8 స్థానాల్లో గెలుపొందిందన్నారు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. ఎస్సీ వర్గీకరణకు ప్రధాన మోదీ సానుకూలంగా స్పందించడంతోనే బీజేపీ పార్టీ మద్దతు ప్రకటించినట్లు తెలిపారు. మంగళవారం సికింద్రాబాద్, పార్శిగుట్టలోని ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. మాదిగల అస్థిత్వం దృష్ట్యా బీజేపీలోనే న్యాయం జరుగుతుందన్నారు.
తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉన్నారన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించడంతో నియంతృత్వం, అహంకారం, కుటుంబ పాలనకు చరమగీతం పాడారన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అని కాంగ్రెస్ చేసిన ప్రచారాన్ని ప్రజలు విశ్వసించారని తెలిపారు. దానికి కారణంగా లిక్కర్ స్కాంలో అందరూ అరెస్ట్ అయినా, కవితను అరెస్ట్ చేయకపోవడం అదే సమయంలో బండి సంజయ్‌ని అధ్యక్ష పదవి నుంచి తప్పించడంతో ప్రజలు రెండు పార్టీలు ఒకటే అని నమ్మినట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో మాదిగలకు స్థానం లేదని, ఆ పార్టీ మాదిగలను అణచివేసేందుకు ప్రయత్నం చేసిందని ఆరోపించారు. మాదిగ భవిష్యత్ కోసం బీజేపీతోనే మా ప్రయాణం కొనసాగుతుందని స్పష్టం చేశారు.