Home > తెలంగాణ > Telangana Elections 2023 > KTR : బీఆర్ఎస్‌‌కు గతంలో కంటే ఎక్కువ సీట్లే వస్తాయ్.. మంత్రి కేటీఆర్

KTR : బీఆర్ఎస్‌‌కు గతంలో కంటే ఎక్కువ సీట్లే వస్తాయ్.. మంత్రి కేటీఆర్

KTR : బీఆర్ఎస్‌‌కు గతంలో కంటే ఎక్కువ సీట్లే వస్తాయ్.. మంత్రి కేటీఆర్
X

తెలంగాణలో బీఆర్ఎస్ కు పోటీ లేదన్నారు మంత్రి కేటీఆర్ . బీఆర్ఎస్ కు గతంలో కంటే ఎక్కువ సీట్లే వస్తాయని, సర్వేలన్నీ 70-82 సీట్లు వస్తాయని చెబుతున్నాయన్నారు. ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... తెలంగాణలో కాంగ్రెస్‌ది సెకండ్ ప్లేసేనన్నారు. కాంగ్రెస్ కు 20 సీట్లు మించి రావని చెప్పారు. విజన్ ఉన్న నాయకత్వం బీఆర్ఎస్ కు మాత్రమే ఉందని, కాంగ్రెస్ వస్తే రియల్ ఎస్టేట్ ఢమాల్ అంటుందన్నారు. కాంగ్రెస్ వచ్చాక బెంగళూరులో 28శాతం రియల్‌ఎస్టేట్‌ పడిపోయిందన్నారు

కాంగ్రెస్ నేతల జుట్టు ఢిల్లీ చేతిలో ఉంటుందని చెప్పిన కేటీఆర్... కాంగ్రెస్ వస్తే 6 నెలలకో సీఎం మారతాడన్నారు. కాంగ్రెస్ చెబుతున్న మార్పును ప్రజలు కోరుకోవడం లేదని, 2014లోనే తెలంగాణలో మార్పు మొదలైందన్నారు. ప్రజలు స్థిరమైన ప్రభుత్వాన్ని, బలమైన నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు.

నిరుద్యోగం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉందన్నారు కేటీఆర్. దేశంలోనూ, రాష్ట్రంలోనూ నిరుద్యోగం ఉందని, తమ హయాంలో 1,60,083 ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు. టీఎస్‌పీఎస్‌సీలో లోపాలున్నాయని.. వాటిని సరిదిద్దుకుంటాం. ప్రక్షాళన చేస్తామని చెప్పారు. తమకంటే.. ఎక్కువ ఉపాధి కల్పించిన ఒక్క రాష్ట్రాన్ని చూపించాలని సవాల్ చేశారు. గుజరాత్‌లోనూ ఎన్నోసార్లు పేపర్ లీకేజీలు అయ్యాయని చెప్పారు.

కేసీఆర్ సీఎం ఉండాలన్నాదే తమన కోరిక అని, 90 ఏండ్ల వయస్సులోనూ కరుణానిధి తమిళనాడు సీఎం గా పని చేశారన్నారు. కేసీఆర్ కు 69 ఏండ్లేనన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చాక తనకు టూరిజం శాఖ అడుగుతా అన్నారు కేటీఆర్. టూరిజం అభివృద్ధిపై అనేక ప్రణాళికలు ఉన్నాయని చెప్పారు. ఎంఐఎం తో మేం పొత్తు పెట్టుకోలేదని, బీఆర్ఎస్ ఎప్పటికీ సెక్యులర్‌గానే ఉంటుందన్నారు కేటీఆర్. తమకు ఎవ్వరితో శతృత్వం అవసరం లేదని.. తెలంగాణ అభివృద్ధే ముఖ్యమన్నారు




Updated : 23 Nov 2023 11:37 AM IST
Tags:    
Next Story
Share it
Top