Home > తెలంగాణ > Telangana Elections 2023 > Telangana Ministers : తొలిసారి మంత్రులు అయ్యింది వీరే.. రేవంత్ సహా..

Telangana Ministers : తొలిసారి మంత్రులు అయ్యింది వీరే.. రేవంత్ సహా..

Telangana Ministers :  తొలిసారి మంత్రులు అయ్యింది వీరే.. రేవంత్ సహా..
X

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. రేవంత్ రెడ్డి సీఎంగా, భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటు 10మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో గవర్నర్ తమిళిసై ప్రమాణం చేయించారు. వీరిలో పలువురు తొలిసారి మంత్రి పదవులు చేపట్టారు. రేవంత్ రెడ్డితో పాటు మల్లు భట్టి విక్రమార్క, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తొలిసారి మంత్రి పదవి చేపట్టారు.

రేవంత్ గతంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీగా పనిచేశారు. భట్టి విక్రమార్క ఎమ్మెల్సీ, డిప్యూటీ స్పీకర్ గా పనిచేసిన అనుభవం ఉంది. పొన్నం ప్రభాకర్ గతంలో ఎంపీగా పనిచేయగా.. ఇప్పుడు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సీతక్క ఎమ్మెల్యే పనిచేయగా.. పొంగులేటీ ఎంపీగా పనిచేశారు. వీరంతా తొలిసారి మంత్రులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా తెలంగాణ ఎన్నికల్లో 64 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.


Updated : 7 Dec 2023 8:50 AM GMT
Tags:    
Next Story
Share it
Top