Home > తెలంగాణ > Telangana Elections 2023 > Congress First List: ఒక్క ఫ్యామిలీకి రెండు టికెట్లు.. జానారెడ్డి కుటుంబానికి మాత్రం...

Congress First List: ఒక్క ఫ్యామిలీకి రెండు టికెట్లు.. జానారెడ్డి కుటుంబానికి మాత్రం...

Congress First List: ఒక్క ఫ్యామిలీకి రెండు టికెట్లు.. జానారెడ్డి కుటుంబానికి మాత్రం...
X

తెలంగాణ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ 55 మందితో మొదటి జాబితాను విడుదల చేసింది. వామపక్షాల 4 సీట్లు మినహాయిస్తే మిగిలిన 115 స్థానాల్లో 55 మంది పేర్లు ఖరారు చేసింది. తొలి జాబితాలో కాంగ్రెస్ అగ్ర నేతల పేర్లున్నాయి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనర్శింహ, శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరుల పేర్లున్నాయి. ఎంపీలుగా ఉన్న రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తం కుమార్ రెడ్డిలు ఈసారి అసెంబ్లీకు పోటీ చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కుమారుడికి సీటు ఖాయమైంది. అటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకు వచ్చిన మైనంపల్లి కుటుంబానికి, కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబానికి కూడా రెండు సీట్లు కేటాయించింది పార్టీ.

2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, కోదాడ నుంచి పద్మావతికి టిక్కెట్లు కేటాయించింది. హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించగా.. కోదాడ నుంచి పోటీ చేసిన పద్మావతి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. గత నెలలోనే కాంగ్రెస్ పార్టీలో చేరిన మైనంపల్లి హన్మంతరావు కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ టికెట్లు కేటాయించింది. మైనంపల్లి హన్మంతరావుకు మల్కాజిగిరి టికెట్ కేటాయించారు. మెదక్‌ నుంచి హన్మంతరావు కుమారుడు రోహిత్‌రావుకు కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ కేటాయించింది. జానారెడ్డి కుటుంబం కూడా రెండు టిక్కెట్లు ఆశించింది. ఆయన తన ఇద్దరు కుమారులకి అధిష్టానం నుంచి సీట్లు కోరారు. అయితే పెద్ద కుమారుడు జయవీర్ రెడ్డికి మాత్రమే నాగార్జునసాగర్ నుంచి కేటాయించింది. మిర్యాలగూడ నుంచి చిన్న కుమారుడు రఘువీర్‌కు కూడా టికెట్‌ కేటాయించాలని కోరారు జానారెడ్డి. అయితే పొత్తు కారణంగా మిర్యాలగూడ సీటును సీపీఎం కోరుతోంది. దీంతో ఆ సీటును జానా రెడ్డి కుటుంబానికి కేటాయిస్తారా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు.

ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు సిట్టింగ్ స్థానాలకు అభ్యర్ధిలను కాంగ్రెస్ అధిష్టానం వెల్లడించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది స్థానాలు ఉండగా అందులో మధిర నుంచి భట్టి విక్రమార్క, భద్రాచలం నుంచి పొదెం వీరయ్యను అభ్యర్ధులుగా అధిష్టానం ప్రకటించింది. భట్టి విక్రమార్క నాలుగో సారి ఎన్నికల బరిలో దిగనున్నారు. అంతకు ముందు భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా స్థానిక సంస్థ ల ఎంఎల్ సి గా గెలుపొందాడు. ఆ తరువాత మధిర నుంచి 2008 ,2014,2018 లలో పోటీ చేసి భట్టి విక్రమార్క గెలుపొందాడు. భట్టి విక్రమార్క మధిర నుంచి మూడు సార్లు వరుసగా వెంట గెలిచి హ్యాట్రిక్ సాధించాడు.

భద్రాచలం నుంచి పోటీ చేయనున్న పొదెం వీరయ్య ఇప్పటికి మూడు సార్లు ఎంఎల్ఎగా పని చేశారు. ములుగు ఎంఎల్ఎగా ఆయన ప్రస్తానం ప్రారంభం అయ్యింది. ములుగులో 1997 లో స్వతంత్రంగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఆతరువాత 1999, 2004 కాంగ్రస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత మళ్లీ 2009 లో కాంగ్రెస్ నుంచి పోటీచేయగా అప్పటిలో టీడీపీ నుంచి పోటీచేసిన సీతక్క గెలుపొందింది. ఖమ్మం జిల్లాలో ఆరు స్థానాల్లో కాంగ్రెస్ 2018 లో గెలిచినప్పటికి పొదెం వీరయ్య మీద ఎంత వత్తిడి వచ్చినప్పటికి పొదెం మాత్రం పార్టీ మారకుండా ఉన్నాడు. సీపీఎం పార్టీ జాతీయ స్థాయిలో భద్రాచలం సీటు ఇవ్వాలని వత్తిడి చేసినప్పటికి పొదెం వీరయ్యను వదులుకునేందుకు కాంగ్రెస్ ఇష్ట పడలేదు




Updated : 15 Oct 2023 11:33 AM IST
Tags:    
Next Story
Share it
Top