TS elections: పువ్వాడ పూజకు పనికి రాని పువ్వు: తుమ్మల
X
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తన తండ్రి ప్రతిష్టను నాశనం చేస్తున్నాడని అజయ్ పై మండిపడ్డారు. ఉద్యమ సమయంలో తెలుగుదేశం పార్టీని కాపాడే ప్రయత్నం చేసి, మంత్రి పదవి కోసం డబ్బులిచ్చి తనను ఓడించారని ఆరోపించారు. అజయ్ నువ్వెంత? నీ బతుకెంత? అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ వచ్చి మూడు నెలలు తనను బతిమిలాడితేనే బీఆర్ఎస్ లో చేరానని చెప్పుకొచ్చారు. పువ్వాడ వయ్యారి భామ లాంటి పువ్వు.. పూజకు పనికి రాని పువ్వు పువ్వాడ అని ధ్వజమెత్తారు.
తుమ్మ ముదిరి.. రైతన్నకు అరకగా సాయం చేస్తుంది. నీళ్లు లేకుండా బతికుతుందని కేసీఆర్ మాటలకు కౌంటర్ వేశారు. ఆరేళ్లైనా ఖమ్మానికి ఒక్క అభివృద్ధి తీసుకురాలేదని ఫైర్ అయ్యారు. కాంట్రాక్టర్లను బెదిరించే.. ఆంధ్రా, తెలంగాణలో కట్టిన ప్రతీ ప్రాజెక్ట్ లో తన భాగస్వామి అయ్యాడని ఆరోపించారు. కేసీఆర్ కు మంత్రి పదవి ఇచ్చింది తానేనని, కావాలంటే చంద్రబాబు నాయుడును అడగాలని ఎద్దేవా చేశారు. డిసెంబర్ 3 తర్వాత పువ్వాడను 14 అడుగుల గోతిలో పాతి పెడతారని చెప్పారు. తనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే డివిజన్లలో తిరగనివ్వమని హెచ్చరించారు. గుండు సున్నాగా ఉన్న బీఆర్ఎస్ ను ఒక స్థాయికి తీసుకొచ్చారని అన్నారు.