Tinmar Mallanna : తీన్మార్ మల్లన్న యూటర్న్.. కాంగ్రెస్ అభ్యర్థిగా చేరి పోటీ!
X
తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ విషయాన్ని టీ కాంగ్రెస్ ట్విటర్ ద్వారా ప్రకటించింది. కాగా ఇటీవలే తానే కొత్తగా తెలంగాణ నిర్మాణ పార్టీని ఏర్పాటుచేసి, రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా మాదం రజినీ కుమార్ (వరంగల్ జిల్లా ధర్మసాగర్), కోశాధికారిగా ఆర్. భావన (చంపాపేట్, సరూర్ నగర్) ఉంటారని అప్లికేషన్ లో తెలిపారు. మల్కాజిగిరి నియోజకవర్గం మంత్రి మల్లారెడ్డిపై పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా యూటర్క్ తీసుకున్న మల్లన్న కాంగ్రెస్ కండువా కప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో మల్కాజిగిరి టికెట్ ను మైనంపల్లి హనుమంతరావుకు కేటాయించింది. కాగా మల్లన్న ఏ స్థానం కేటాయిస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది.