Home > తెలంగాణ > Telangana Elections 2023 > Revanth Reddy : కొడంగల్‌లో ప్రతీ బిడ్డ కాంగ్రెస్‌కు అధ్యక్షుడే.. రేవంత్ రెడ్డి

Revanth Reddy : కొడంగల్‌లో ప్రతీ బిడ్డ కాంగ్రెస్‌కు అధ్యక్షుడే.. రేవంత్ రెడ్డి

Revanth Reddy : కొడంగల్‌లో ప్రతీ బిడ్డ కాంగ్రెస్‌కు అధ్యక్షుడే.. రేవంత్ రెడ్డి
X

ఈ ఎన్నికలు కొడంగల్ ప్రాంత ప్రజలకు, కేసీఆర్ కు మధ్య జరుగుతున్నాయన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కొడంగల్‌లో నామినేషన్‌ వేసేందుకు వెళ్లిన రేవంత్‌ జనసభలో మాట్లాడారు. ఈ ఎన్నికలు ఆశామాషీ ఎన్నికలు కాదని ఇక్కడి ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చే ఎన్నికలన్నారు. దేశ ముఖ చిత్రంలో కొడంగల్‌కు గుర్తింపు తెచ్చే ఎన్నికలని చెప్పారు. గ్రూపులు, గుంపులు కాదు కొడంగల్ అంతా కలిసి రావాలని కాంగ్రెస్ ను గెలిపించేందుకు ఏకగ్రీవ తీర్మానం చేయాలన్నారు. చీలిపోతే కూలిపోతాం.. కూలిపోతే మీ జీవితాలు ఆగమైతాయన్నారు.

మహబూబ్‌నగర్‌కు తెలంగాణ వచ్చిన పదేళ్లలో కేసీఆర్‌ ఎందుకు న్యాయం చేయలేదన్నారు. ఈ ప్రాంతానికి న్యాయం చేసి ఉంటే కొడంగల్‌లో తేల్చుకోడానికి రమ్మంటే ఎందుకు స్పందించలేదన్నారు. కృష్ణా జలాలు పారించి ఉన్నా, కోస్గిలోమహిళా కాలేజీ, ఇంజీనింగ్ కాలేజీలు కట్టి ఉంటే ప్రజలు కేసీఆర్ మాటలు నమ్మే వారన్నారు. ఐదేళ్లలో కొడంగల్ కు సీఎం కేసీఆర్ , మంత్రి కేటీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీ ఒక్కటి కూడా నెరవేరలేదన్నారు రేవంత్ రెడ్డి. హామీలు ఇచ్చి మోసం చేసిన బీఆర్ఎస్ నాయకులు ఇవాళ ఏ ముఖంతో ఓట్లు అడుగుతారని నిలదీశారు. దత్తత కాదు.. ధైర్యం ఉంటే కొడంగల్ లో పోటీ చెయ్ తేల్చుకుందామని కేసీఆర్ కు తాను సవాల్ విసిరానని చెప్పారు. అభివృద్ధి చేయలేదు కాబట్టే తాను విసిరిన సవాల్ ను కేసీఆర్ స్వీకరించలేదన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి తనది కాదన్న రేవంత్ ... కొడంగల్ లో ప్రతీ బిడ్డ కాంగ్రెస్ కు అధ్యక్షుడేనని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత మీ అందరిపై ఉందన్నారు. కొడంగల్ బిడ్డకు రాష్ట్ర నాయకత్వం దక్కబోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ ఎన్నికల్లో కర్ణాటక కంటే గొప్ప తీర్పు కొడంగల్ ప్రజలు ఇవ్వాలన్నారు. కర్ణాటకలో డీకే శివకుమార్ కంటే ఎక్కువ మెజారిటీతో కొడంగల్ లో కాంగ్రెస్ ను గెలిపించాలన్నారు. గెలిచిన రెండేళ్లలో నారాయణపేట కొడంగల్ ఎత్తి పోతల పూర్తి చేసి నీళ్లు తీసుకొస్తానని చెప్పారు. ఏడాదిలో మహబూబ్ నగర్ చించొలి జాతీయ రహదారి పూర్తి చేయిస్తానని, ఆడబిడ్డలకు ప్రత్యేక డిగ్రీ కాలేజీలు తీసుకొస్తామన్నారు. అండగా నిలబడే ప్రజల ఆత్మగౌరవం నిలబెట్టే బాధ్యత తనదని చెప్పారు.




Updated : 6 Nov 2023 2:25 PM IST
Tags:    
Next Story
Share it
Top