Revanth Reddy : సచివాలయ గేట్లు సామాన్యుల కోసం తెరిచే ఉంటాయి : రేవంత్
X
తెలంగాణ ఎన్నికల్లో ఘనవిజయం సాధించడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి ప్రజల అవకాశం ఇచ్చారని.. డిసెంబర్ 3 చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఈ విజయం తెలంగాణ అమరవీరులకు అంకితమిస్తున్నట్లు తెలిపారు. కేటీఆర్ అభినందనలను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ప్రతిపక్షం బాధ్యత వ్యవహరించి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. పార్టీని ముందుకు నడిపించడంలో పెద్దలందరి కష్టం ఉందన్నారు.
సచివాలయ గేట్లు సామాన్యుల కోసం ఎప్పుడూ తెరిచేవుంటాయని రేవంత్ అన్నారు. ప్రగతిభవన్ను డా.బీఆర్.అంబేద్కర్ ప్రజాభవన్గా మారుస్తామని చెప్పారు. తనకు అడుగడుగునా అండగా నిలబడ్డా రాహుల్ గాంధీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సోనియా గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, మాణిక్ రావ్ థాక్రే, మాణిక్కం ఠాగూర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అందరి సహకారంతో రాష్ట్రాన్ని దేశానికే రోల్ మోడల్గా తీర్చిదిద్దుతామని చెప్పారు.