Home > తెలంగాణ > Telangana Elections 2023 > TS Assembly Elections 2023 : కామారెడ్డిలో కేసీఆర్‌పై పోటీ చేసేందుకు సిద్ధం.. రేవంత్ రెడ్డి

TS Assembly Elections 2023 : కామారెడ్డిలో కేసీఆర్‌పై పోటీ చేసేందుకు సిద్ధం.. రేవంత్ రెడ్డి

TS Assembly Elections 2023 : కామారెడ్డిలో కేసీఆర్‌పై పోటీ చేసేందుకు సిద్ధం.. రేవంత్ రెడ్డి
X

అధిష్ఠానం ఆదేశిస్తే కామారెడ్డిలో కేసీఆర్ పై తాను పోటీ చేసేందుకు సిద్ధమని టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి అన్నారు. పార్టీ ఆదేశిస్తే తానైనా, భట్టీ విక్రమార్క అయినా.. కామారెడ్డిలో కెసిఆర్ పై, సిరిల్లలో కేటీఆర్ పై పోటీకి సిద్ధమని తెలిపారు. కేసీఆర్, కేటీఆర్ లను చిత్తుగా ఓడించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తోందంటూ గురువారం ఢిల్లీలో ఈసీకి ఫిర్యాదు చేశారు రేవంత్ రెడ్డి. ఫిర్యాదు చేసినవారిలో మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టీ విక్రమార్క లు కూడా ఉన్నారు.

అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘కేసీఆర్‌, కేటీఆర్‌ను చిత్తుగా ఓడించేందుకు సిద్ధంగా ఉన్నాం. కొడంగల్‌ నుంచి పోటీ చేయాలని కేసీఆర్‌ను ఆహ్వానించా. కొడంగల్‌కు పోటీకి కేసీఆర్‌ రాకపోతే కామారెడ్డిలో పోటీకి నేను సిద్ధం’’ అని తెలిపారు. ‘‘సంక్షేమ పథకాల నగదు బదిలీపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశాం. పార్టీ కార్యకర్తల్లా పనిచేస్తున్న అధికారులను బదిలీ చేయాలని కోరాం అని తెలిపారు.

బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్న రిటైర్డ్ అధికారులను ఎన్నికల విధుల నుంచి వెంటనే తొలిగించాలని ఈసీని కోరినట్లుగా తెలిపారు. డీజీపీ అంజనీ కుమార్ ను కూడా వెంటనే తొలిగించాలని ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. నిష్పక్షపాతంగా వ్యవహరించే అధికారులను నియమించాలని.. సంక్షేమ పథకాల నగదు బదిలీపై ఎన్నికల అధికారులకు సూచన చేశామని చెప్పారు. నోటిఫికేషన్‌కు ముందే నగదు బదిలీని పూర్తి చేయాలని ఈసీకి చెప్పామని... కాని, సంక్షేమ పథకాలు ఆపేయాలని ఫిర్యాదు చేసినట్లు బీఆర్ఎస్ తమపై తప్పుడు ప్రచారం చేస్తుందని ఆయన మండిపడ్డారు. ఉమ్మడి ఏపీలో ప్రజలు ఎప్పుడూ హంగ్ కు అవకాశం ఇవ్వలేదని... తెలంగాణలోనూ హంగ్ ఎప్పుడూ రాలేదని.. రెండింట మూడో వంతు మెజారిటీతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.




Updated : 26 Oct 2023 8:00 AM GMT
Tags:    
Next Story
Share it
Top