Home > తెలంగాణ > Telangana Elections 2023 > Telangana Congress MLAS : కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ క్లాసులు..

Telangana Congress MLAS : కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ క్లాసులు..

Telangana Congress MLAS   : కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ క్లాసులు..
X

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులను నిర్వహించారు. కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్‌ చిన్నారెడ్డి, ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌లు శాసనసభా వ్యవహారాలపై ఎమ్మెల్యేలకు క్లాస్లులు చెప్పారు. శాసనసభలో వ్యవహరించాల్సిన తీరు, ఎమ్మెల్యే బాధ్యతలు, రాజ్యాంగపరమైన అంశాలను ఎమ్మెల్యేలకు వివరించారు. ఈ సారి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని, మెదక్ ఎమ్మెల్యే రోహిత్, నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేశ్ సహా పలువురు శాసనసభకు కొత్తగా ఎన్నికవడంతో శిక్షణా తరగతులు నిర్వహించారు.

కాగా రేపు ఉదయం 10.28కి సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి సంబంధించి ఎల్బీ స్టేడియంలో ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. ప్రమాణస్వీకారానికి రావాలని పార్టీ పెద్దలను ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే కేసీ వేణుగోపాల్తో ఆయన భేటీ అయ్యారు. కాసేపట్లో సోనియా గాంధీ, మల్లిఖార్జున ఖర్గేతో సమావేశం కానున్నారు. అదేవిధవగా కేబినెట్ కూర్పుపై వారితో చర్చించే అవకాశం ఉంది.


Updated : 6 Dec 2023 5:10 AM GMT
Tags:    
Next Story
Share it
Top