Home > తెలంగాణ > Telangana Elections 2023 > అసంతృప్తులకు బుజ్జగింపు.. టికెట్ దక్కని వారికి కార్పొరేషన్ పదవులు

అసంతృప్తులకు బుజ్జగింపు.. టికెట్ దక్కని వారికి కార్పొరేషన్ పదవులు

అసంతృప్తులకు బుజ్జగింపు.. టికెట్ దక్కని వారికి కార్పొరేషన్ పదవులు
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే టికెట్ రాని, అసంతృప్తితో ఉన్న లీడర్లను బుజ్జగించే పనిలో పడింది బీఆర్ఎస్. అందులో భాగంగానే తాజాగా కార్పొరేషన్ చైర్మన్ ల నియామకం చేపట్టింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. టీఎస్ఆర్టీసీ చైర్మన్‌గా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని సీఎం కేసీఆర్ నియమించారు. తెలంగాణ రైతు బంధు చైర్మన్‌గా తాటి కొండ రాజయ్య, రాష్ట్ర ఎంబీసీ చైర్మన్‌గా నందికంటి శ్రీధర్ నియమితులయ్యారు. మిషన్ భగీరథ వైస్ చైర్మన్‌గా ఉప్పల వెంకటేశ్ కు బాధ్యతలు అప్పజెప్పారు. వీరి నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేసింది.




Updated : 5 Oct 2023 10:40 PM IST
Tags:    
Next Story
Share it
Top