Tula Uma :బీజేపీకి గుడ్ బై.. సొంతగూటికి తుల ఉమ
X
తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బిజెపి పార్టీకి భారీ షాక్ తగిలింది. కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ తుల ఉమా.. బీజేపీకి గుడ్ బై చెప్పి ఈరోజు కారు ఎక్కబోతున్నారు. వేములవాడలో బీజేపీ అభ్యర్థిగా ప్రకటించిన తులా ఉమకు టికెట్ ఇచ్చి బీఫామ్ ఇవ్వకపోవడంతో అక్కడ రాజకీయం రసవత్తరంగా మారింది. వేములవాడ బరి నుంచి వికాస్ రావు బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగడంతో తుల ఉమ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
ఈ క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు తుల ఉమాతో రెండు గంటలుగా చర్చలు జరిగాయి. సిరిసిల్ల తెలంగాణ భవన్ వేదికగా వినోద్ కుమార్ మంతనాలు జరిపారు. అటు ఉమతో ఈ సందర్బంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడడం జరిగిందట. అంతే కాకుండా ఉమ ఇంటికి వినోద్ కుమార్, బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు వెళ్లినట్లు సమాచారం. ఇలా అందరు ఉమా తో మాట్లాడడం తో ఇక చివరికి ఆమె బిఆర్ఎస్ లో చేరేందుకు ఓకే చెప్పారు. ఈరోజు మంత్రి కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరనున్నారు.
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తుల ఉమ.. అంతకుముందే బీఆర్ఎస్ లోనే ఉన్నారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అనుచరురాలిగా ఉన్నారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈటల తర్వాత ఆమె కూడా బీఆర్ఎస్ తో విభేదించి బీజేపీలో చేరారు. కానీ బీజేపీ ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చిన తర్వాత.. తనకు కాకుండా వికాస రావుకు పార్టీ అధిష్టానం బీ ఫామ్ ఇవ్వడంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఎంపీ బండి సంజయ్ మాట్లాడితే బీసీలు అంటారని, బీఫాం మాత్రం దొరల కాళ్ల దగ్గర పెట్టారని విమర్శించారు. టికెట్ఇస్తామని మోసగించిన బీజేపీ లీడర్లు తనకు ఎవరైనా ఫోన్ చేస్తే చెప్పుతో కొడతానని ఫైర్ అయ్యారు.