Uttam Kumar Reddy : సీఎం అభ్యర్థిగా ఎవరిని ప్రకటించినా నాకు ఓకే: ఉత్తమ్
X
సీఎం అభ్యర్థిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అధిష్ఠానం ఎవరిని సీఎం చేసిన తనకు ఒకే అని చెప్పారు. సీఎం అభ్యర్థిని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఖరారు చేస్తారని.. వారు ఎవరి పేరును ప్రకటించిన తమకు సమ్మతమేనన్నారు. కాగా ఇవాళ ఉదయం ఢిల్లీ వెళ్లిన ఉత్తమ్.. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో భేటీ అయ్యారు. సుమారు గంట పాటు సాగిన ఈ సమావేశంలో సీఎం అభ్యర్థి సహా మంత్రివర్గ కూర్పుపై చర్చించారు. సీఎం ఎంపికకు ముందు వీరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇవాళ సీఎం అభ్యర్థిని ప్రకటించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో అగ్రనేత రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. ఖర్గే నివాసంలో సీఎం అభ్యర్థి ఎంపికపై చర్చిస్తున్నారు. డీకే సైతం ఖర్గే నివాసానికి చేరుకుని ఎమ్మెల్యేల అభిప్రాయానికి సంబంధించిన నివేదికను అందజేశారు. ఈ నివేదికపై ఖర్గే, కేసీ వేణుగోపాల్తో రాహుల్ చర్చిస్తున్నారు. దీంతో సాయంత్రంలోపు సీఎం అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది.