Uttam Kumar Reddy : ఎంపీ పదవికి రాజీనామా.. కాసేపట్లో లోక్సభ స్పీకర్తో ఉత్తమ్ భేటీ..
X
కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో భేటీ అయ్యారు. డీకేఎస్ సోదరుడు సురేష్ ఇంట్లో వీరి భేటీ జరిగింది. కాసేపట్లో ఆయన స్పీకర్ ఓం బిర్లాను కలిసే అవకాశం ఉంది. ఎంపీ పదవికి రాజీనామా చేస్తారని తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నారు. కాగా ఉత్తమ్ సీఎం రేసులో ఉన్నారు.
ఈ ఉదయమే భట్టితో కలిసి ఉత్తమ్ ఢిల్లీ వెళ్లారు. మధ్యాహ్నం ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గేతో సమావేశం కానున్నారు. సీఎంగా తమకు అవకాశం ఇవ్వాలని ఈ భేటీలో కోరనున్నారు. కాగా సీఎం రేసులో రేవంత్ రెడ్డి ముందున్నారు. మెజార్టీ ఎమ్మెల్యేలు ఆయనవైపే మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. అయితే సీనియర్లు మాత్రం దీనికి సేసేమీరా అంటుండంతో బంతి అధిష్టానం కోర్టులో ఉంది. మరోవైపు సీఎం ఎంపికపై ఖర్గే క్లారిటీ ఇచ్చారు. ఇవాళ సాయంత్రంలోపు సీఎం అభ్యర్థిని ఫైనల్ చేస్తామని స్పష్టం చేశారు. దీంతో సీఎం ఎవరనేదానికి మరికొన్నిగంటల్లో చెక్ పడనుంది.