Home > తెలంగాణ > Telangana Elections 2023 > KTR : నిరాశలో ఉన్న కాంగ్రెస్ భౌతిక దాడులకు దిగుతోంది - కేటీఆర్

KTR : నిరాశలో ఉన్న కాంగ్రెస్ భౌతిక దాడులకు దిగుతోంది - కేటీఆర్

KTR : నిరాశలో ఉన్న కాంగ్రెస్ భౌతిక దాడులకు దిగుతోంది - కేటీఆర్
X

ఎంపీ కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డిపై జరిగిన దాడిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ గూండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. నిరాశలో ఉన్న కాంగ్రెస్ పార్టీ భౌతిక దాడులకు దిగుతోందని మండిపడ్డారు. ఈ మేరకు కేటీఆర్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నేతలను అంతం చేసే ప్రయత్నం చేస్తోందని పైర్ అయ్యారు. ప్రజాస్వామ్యంలో హింస, దాడులకు తావు లేదని స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఈసీ కఠిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నానని కేటీఆర్ ట్వీట్లో రాశారు.




Updated : 30 Oct 2023 8:37 PM IST
Tags:    
Next Story
Share it
Top